Miss World 2025 : ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్న క్రమంలో.. అలాగే దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ట్రైడెంట్ హోటల్‌లో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ఈ హోటల్‌లోనే మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొంటున్న అందమైన కంటెస్టెంట్‌లు బస చేస్తున్నారు. ట్రైడెంట్ హోటల్ భద్రతా బాధ్యతలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. హోటల్‌లో ఆక్టోపస్ టీమ్‌తో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. సైబరాబాద్ పోలీసులు హోటల్‌లో పకడ్బందీగా భద్రతను ఏర్పాటు చేయగా, మాదాపూర్ పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తున్నారు.
Pakistan Shelling : సరిహద్దు గ్రామాలు ఖాళీ.. ఊళ్లను విడుస్తున్న జనాలు
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ స్వయంగా హోటల్‌లోని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. హోటల్ పరిసరాల్లో ప్రత్యేక బలగాలను మోహరించడంతో పాటు, సందర్శకులపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ‘ఆపరేషన్ సింధూర్’ నేపథ్యంలో నగరంలో అలర్ట్ ప్రకటించిన పోలీసులు, మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండటంతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగకుండా, అలాగే నగరంలో శాంతిభద్రతలు కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ట్రైడెంట్ హోటల్ పరిసరాల్లో భద్రతా సిబ్బంది నిరంతర నిఘా కొనసాగుతోంది.