Hyderabad: హైదరాబాద్ మహానగరంలో తాజాగా కాల్పుల కలకలం చోటుచేసుకుంది. చాదర్‌ఘాట్ ప్రాంతంలో సెల్‌ఫోన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఓ దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనలో సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్యపై దొంగ కత్తితో దాడికి యత్నించగా.. డీసీపీ స్వయంగా కాల్పులు జరిపారు. సెల్‌ఫోన్ స్నాచింగ్ చేస్తున్న దొంగను పట్టుకోవడానికి డీసీపీ చైతన్య ప్రయత్నించారు. ఈ సమయంలో ఆ దొంగ డీసీపీ చైతన్యపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ తోపులాటలో డీసీపీ గన్‌మ్యాన్ కిందపడటంతో,…
Hyderabad ORR Tragedy: హైదరాబాద్ లో మరో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడగా, ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.
Hyderabad Fire Accident: హైదరాబాద్ నగరంలోని మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియన్ కంటైనర్స్ కార్పొరేషన్ డిపో (ICD)లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది.
Hit And Run Case: హైదరాబాద్ మహా నగరంలోని నార్సింగి పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదర్ షాకోట్ చౌరస్తా దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే, హైదర్ షాకోట్ ప్రాంతానికి చెందిన కృష్ణ అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది.
CM Chandrababu: దుబాయ్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పెట్టుబడులే లక్ష్యంగా మూడు రోజుల పాటు దుబాయ్‌లో పర్యటించారు ఏపీ సీఎం.. ఈ పర్యటనలో ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో.. 25 కీలక సమావేశాల్లో పాల్గొన్నారు.. గల్ఫ్ దేశాల్లోని ప్రవాసాంధ్రులతోనూ సమావేశమయ్యారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు.. ఉన్న వనరులు.. రాష్ట్ర ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు.. ఇలా అన్ని వివరించారు సీఎం చంద్రబాబు.. నవంబర్ 14, 15 తేదీల్లో…
Gym Centers : జంట నగరల వ్యాప్తంగా 20 జిమ్ సెంటర్ లలో డ్రగ్ కంట్రోల్ బోర్డ్ అధికారులుతనిఖీలు నిర్వహించారు..బాడీ బిల్డింగ్ కోసం స్టేరాయిడ్స్ వాడుతున్నారన్న అనుమానంతో ఆకస్మికంగా తనిఖీలతో స్పెషల్ ఆపరేషన్ ను డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్వహించారు..పలు జిమ్ సెంటర్లలో తనిఖీలు చేసి ఎటువంటి స్టెరాయిడ్స్ కానీ, డ్రగ్ కానీ కస్టమర్లకు ఇవ్వద్దని సూచించారు.. రెండు రోజుల క్రితం జిమ్ సెంటర్ నిర్వాకుడు స్టెరైడ్ ఇంజక్షన్స్ అమ్ముతూ పట్టుబడడంతో.. జిమ్ సెంటర్ల పై స్పెషల్…
Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం వేకువజామున 3.30 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తొలుత బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు.…
పాతబస్తీలో భాగ్యలక్ష్మీ ఆలయం ఎక్కడుంది? అంటూ హేళన చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఈరోజు కళ్లు తెరిచి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి శక్తిని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశం రావడం తన అద్రుష్టంగా భావిస్తున్నానని తెలిపారు. అమ్మవారిని దర్శించుకున్నాకే ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైందని, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్, దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచిందన్నారు. పార్లమెంట్ లో 8 స్థానాలు గెలుచుకోవడమే కాకుండా విజయ పరంపరను…
దీపావళి పండగ రోజు టపాకాయలు కాల్చి ఎంజాయ్ చేస్తుంటారు. పెద్దవాళ్లు కూడా చిన్న పిల్లల్లా మారి బాణసంచా కాలుస్తుంటారు. ఇక చిన్న పిల్లల సంగతి చెప్పాల్సిన పనిలేదు. తల్లిదండ్రులను బ్రతిమిలాడుకుని మరి టపాసులు కొనుక్కొచ్చుకుని కాలుస్తుంటారు. అయితే ఈ బాణసంచా కాల్చే సమయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. చేతిలో పేలడం, కళ్లల్లో పడడంతో గాయాలపాలవుతున్నారు. ఏటా దీపాల పండుగ రోజున టపాసులు కాల్చే సమయంలో ఆనందాలతో పాటు విషాదాలూ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి…
హైదరాబాద్ నగరంలో సదర్ సందడి మొదలైంది. గుమాన్ కాళీ దున్నరాజు సదర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కేరళ నుంచి తీసుకువచ్చిన గుమాన్ కాళీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది. 7కోట్ల ఖర్చు, 2500 కేజీల బరువు, 7 అడుగుల ఎత్తుతో అట్రాక్ట్ చేస్తోంది. నిర్వాహకుడు మధు యాదవ్ హర్యానా నుంచి ప్రత్యేకంగా 15 దున్నరాజులను తీసుకువచ్చినట్లు తెలిపారు. కాగా ప్రతియేడు దీపావళి వేళ సదర్ ఉత్సవాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి. వివిధ ప్రాంతాల…