CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి ఆధ్వర్యంలో పీవీ మార్గ్ లోని ఎన్టీయార్ గార్డెన్ దగ్గర జరిపిన సంబరాల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
Koti Deepotsavam 2025: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఆధ్యాత్మిక మహా సమ్మేళనం కొనసాగుతోంది.. భక్తి టీవీ నేతృత్వంలో జరుగుతోన్న కోటి దీపోత్సవంలో ఇప్పటికే విజయవంతంగా ఏడు రోజుల పాటు విశేష కార్యక్రమాలు నిర్వహించారు.. ప్రతీ రోజూ విశేష పూజలు.. కల్యాణాలు.. ప్రవచనాలు, వాహన సేవలతో భక్తులను కట్టిపడేస్తోంది కోటి దీపోత్సవం వేడుక.. Read Also: IND vs AUS: నేడు ఆస్ట్రేలియా- భారత్ మధ్య ఐదో టీ20.. సిరీస్ గెలిచేనా..? ఇక, ఈ కోటి దీపాల…
Ganja Gang Attack: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం ప్రాంతంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోతున్నాయి. వనస్థలిపురం పరిధిలోని జెమ్ కిడ్నీ హాస్పిటల్ ముందు చోటుచేసుకున్న ఒక దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గురువారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఆరుగురు యువకులు హాస్పిటల్ ముందు మద్యం తాగుతూ న్యూసెన్స్ సృష్టించారు. హాస్పిటల్ ముందు మద్యం సేవించవద్దని హాస్పిటల్ సిబ్బంది అభ్యర్థించడంతో, ఆ యువకులు వారిపై దాడికి పాల్పడ్డారు.…
Koti Deepotsavam 2025: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఏటా కార్తీకమాసంలో ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. శనివారం ప్రారంభమైన ఈ వేడుకలకు మొదటి రెండు రోజులు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించారు. 2012లో లక్ష దీపోత్సవంగా మొదలై, 2013లో కోటి దీపోత్సవంగా మారి భక్తుల మదిలో అఖండ జ్యోతిగా వెలుగొందుతున్న ఈ దీపాల పండుగ,…
Chamala Kiran Kumar : కేటీఆర్‌పై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను భూతంలా చూపించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్లు దండుకోవడానికే కేటీఆర్ హైడ్రా అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. గాంధీభవన్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. చెరువులు, నాళాలు, ప్రభుత్వ భూములను కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని…
CM Revanth Reddy : మొంథా తుఫాన్ తెలంగాణ మీద భారీ ప్రభావం చూపించింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ లోనూ భారీ వానలు పడుతున్నాయి. వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. చాలా ఊర్లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ తుఫాన్ ప్రభావంపై నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. అందులో భాగంగా నేడు ఉదయం 11 గంటలకు తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం సీఎం రేవంత్…
Off The Record: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముంగిట్లో కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధినాయకత్వం. పార్టీ నాయకుడు, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ప్రకటించింది. ఎల్లుండి సీఎం రేవ్ంత్ రెడ్డి టీమ్‌లో చేరబోతున్నారు అజార్. తెలంగాణ మంత్రివర్గంలో ఇంకా మూడు ఖాళీలు ఉండగా… అందులో ఒకదాన్ని అజార్‌కు క్లియర్ చేశారు. మిగతా రెండిటిని డిసెంబర్లో భర్తీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అజార్.…
Off The Record: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే కార్పొరేషన్ ఛైర్మన్ పదవుల్ని భర్తీ చేసింది. 37 మంది నాయకులకు పదవులు ఇచ్చి బాధ్యతలను అప్పగించింది. సాధారణ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వాళ్ళు… పార్టీ కోసం పనిచేసిన అనుబంధ సంఘాల చైర్మన్ లకు కార్పొరేషన్ చైర్మన్ల పదవులను కట్టబెట్టారు సీఎం రేవంత్‌రెడ్డి. ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్‌గా ఆయనే ఉండడంతో… పనిచేసిన వాళ్లందర్నీగుర్తించి మొదటి విడతలోనే పదవులు ఇచ్చేశారు. అయితే ప్రస్తుతం…
Fake Babas Gang: దుండిగల్ ప్రాంతంలో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని దొంగ బాబాల అవతారమెత్తి అడ్డగోలుగా డబ్బు సంపాదించాలని చూసిన ఓ ముఠా ఆట కట్టించారు పోలీసులు. పూజల పేరుతో ప్రజలను మోసం చేస్తూ, ఆ తర్వాత మత్తుమందు చల్లి అపస్మారక స్థితిలో ఉన్న వారి నుంచి నగదు దోచుకుంటున్న ఈ కేటుగాళ్లను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే… సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఓ వ్యక్తి దొంగ ‘బాబా’…
బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి సిద్ధపడింది. ఆటో డ్రైవర్ల సమస్యలే పరిష్కారం దిశగా సోమవారం గులాబీ పార్టీ నేతలు ఆందోళనలు.. నిరసనలకు రెడీ అయ్యారు. సోమవారం హైదరాబాద్ నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టనున్నారు. ఆటోల్లో ప్రయాణం చేస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు.