IndiGo Flights Delay: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన కొన్ని విమానాల్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీని కారణంగా పలు ఫ్లైట్లు ఆలస్యం అవ్వగా, కొన్ని విమానాలను పూర్తిగా రద్దు చేసినట్లు ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది.
Loan Fraud: హౌసింగ్ లోన్ మోసం కేసులో ఓ దంపతులకు ఏడేళ్ల జైలు శిక్షను విధించింది నాంపల్లి కోర్టు. నకిలీ పత్రాలతో లోన్లు తీసుకుని బ్యాంకులను మోసం చేసిన దంపతులు దసరథ్ నేత, లక్ష్మీబాయిగా గుర్తించారు.
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిన్న పిల్లలపై కుక్క కాట్ల ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం నాడు హయత్‌నగర్‌లో ప్రేమ్‌చంద్ అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
CM Revanth Reddy : హైదరాబాద్ లోని హయత్ నగర్లో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన మూగ బాలుడు ప్రేమ్ చంద్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఢిల్లీలో ఉన్న ఆయన ఉదయం పత్రికల్లో ఈ వార్త చూసి చలించిపోయారు. బాలుడి పరిస్థితి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, వెంటనే సీఎంఓ అధికారులతో మాట్లాడారు. గాయపడిన బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. అలాగే, బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ,…
HYDRA : పాతబస్తీకి తలమానికంగా నిలిచే చారిత్రక బమృక్నుద్దౌలా చెరువు పునరుద్ధరణ పనులు వేగవంతంగా సాగుతూ ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. మరో 15 రోజుల్లో ఈ చెరువును ప్రజలకు అర్పించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గతంలో ఆక్రమణలతో నాశనం అయిన ఈ చెరువు, హైడ్రా చేపట్టిన సమగ్ర అభివృద్ధి చర్యలతో మళ్లీ తన పాత ఔన్నత్యాన్ని తిరిగి పొందుతోంది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం చెరువు అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. చెరువు…
IT Raids On Restaurants: హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ చేపట్టిన దాడులు, విచారణలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఆదాయపు పన్ను ఎగవేత, బ్లాక్ మనీ, హవాలా లావాదేవీల ఆరోపణలపై ఐటీ అధికారులు దృష్టి సారించారు. నవంబర్ 18న ప్రారంభమైన ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. పిస్తా హౌస్ (Pista House), షాగౌస్ (Shah Ghouse), మేహ్ ఫిల్ (Mehfil) వంటి ప్రముఖ రెస్టారెంట్ల యజమానుల ఇళ్లు, కార్యాలయాలు,…
New Year 2026 Permissions: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో న్యూ ఇయర్ 2026 వేడుకలు నిర్వహించాలని భావిస్తున్న హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్లు, రిసార్ట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు ముందస్తుగా అనుమతులు తప్పనిసరిగా పొందాల్సిందిగా పోలీసులు స్పష్టం చేశారు. న్యూ ఇయర్ నైట్ వేడుకలకు సంబంధించిన అనుమతుల కోసం దరఖాస్తు ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు. ఈ అనుమతుల కోసం డిసెంబర్ 21, 2025 వరకు మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. అనుమతి కోసం…
Child Abuse Case: హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌లో నాలుగేళ్ల చిన్నారిపై ఓ ప్రైవేట్ పాఠశాల ఆయా అమానుషంగా వ్యవహరించిన ఘటన వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. పూర్ణిమ స్కూల్లో జరిగిన ఈ దారుణంపై విద్యాశాఖ వెంటనే చర్యలు తీసుకొని స్కూల్‌ను సీజ్ చేసింది. బాధిత చిన్నారి ప్రస్తుతం కోలుకుంటోంది. అభం శుభం తెలియని చిన్న పాపపై ఈ అమానుష హింస అందరిని కలచివేసింది. పాప తండ్రితో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న ఆయా లక్ష్మి, చిన్నారిని స్కూల్ ప్రాంగణానికి…
iBomma Ravi: సైబర్ క్రైమ్ కేసుల్లో అరెస్టయిన ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. ఇప్పటికే ఎనిమిది రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు, ఈ కేసులో పలు ముఖ్యమైన ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రవిపై మరొక మూడు కేసులు నమోదు కావడంతో, ఆయన్ని ఈ కేసుల్లో కూడా కోర్టు ముందు హాజరుపరచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 2వ తేదీ లోపు ఈ కేసుల్లో రవిని…