Hyderabad: ఉప్పల్ లో ASIకి మాంజా తగిలి మెడకు తీవ్ర గాయాలు..
- ఉప్పల్ లో ASIకి మాంజా తగిలి మెడకు తీవ్ర గాయాలు
- చైనా మాంజా బారిన పడి వృద్ధ మహిళకు తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా మాంజా ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పలువురు వ్యక్తులు మాంజా కారణంగా తీవ్రగాయాలపాలవుతుండగా.. మరికొందరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఉప్పల్ లో ఏఎస్ఐకి మాంజా తగిలి మెడకు తీవ్ర గాయాలు అయ్యాయి. నల్లకుంట పీఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ నాగరాజు మెడకు మాంజా చుట్టుకోవడంతో గాయపడ్డారు. ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం ఉప్పల్‌లోని తన ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఉప్పల్ PS పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ వద్ద సాయంత్రం మాంజా ఆయన మెడకు చుట్టుకుని గొంతుకు తీవ్ర గాయామైంది. వెంటనే ఆయనను ఎల్బీనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
Also Read
మరో ఘటనలో.. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
అల్మాస్‌గూడ ప్రధాన రహదారిపై రోడ్డుప్రక్కన నడుచుకుంటూ వెళ్తున్న యాదమ్మ (వయసు సుమారు 70 సంవత్సరాలు) అనే వృద్ధ మహిళకు అకస్మాత్తుగా చైనా మాంజా కాలికి చుట్టుకుంది.
ఈ ఘటనలో ఆమె కాలు తీవ్రంగా కోసుకుపోయి భారీగా రక్తస్రావం అయ్యింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వృద్ధురాలిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
-
OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?
-
US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!