తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాజ్ భవన్ లో మొక్కను నాటారు. అనంతరం మొక్కకు నీటిని పోశారు. ఆపై ఎంవీ సంతోష్ కుమార్ వృక్షవేదం పుస్తకాన్ని సీజేఐకి బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈమేరకు ఎన్వీ రమణను పలువురు ప్రముఖులు కలిసి అభినందనలు తెలిపారు.