హైదరాబాద్ మంగల్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గోదాంపై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు. ఆకాష్ అనే వ్యాపారి మంగల్‌హాట్ అగపురా సీతారాంబాగ్ లోని గోదాంలో అక్రమంగా ఫారెన్ సిగరెట్లను నిల్వ ఉంచి విక్రయిస్తున్నాడు. పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. రూ.20 లక్షల విలువ చేసే విదేశీ కంపెనీకి చెందిన ఫారిన్ సిగరెట్లను పోలీసులు సీజ్ చేశారు. పారిస్, బ్లాక్ సిగరెట్స్ దాదాపు 480 సిగరెట్ ప్యాకెట్ సీల్డ్ డబ్బాలను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆకాష్ అనే వ్యాపారిని అదుపులోకి తీసుకునీ విచారణ నిమిత్తం మాంఘాల హాట్ పోలీసులకు, నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు.