మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌కు బైక్‌లంటే ఎంతో ఇష్టం.. అప్పుడప్పుడు ఖరీదైన బైక్‌లపై హైదరాబాద్‌లో చక్కర్లు కొట్టేస్తుంటాడు.. 2020లో ఓసారి ఓవర్ స్పీడ్ కారణంగా పోలీసులు ఫైన్ కూడా వేశారు. ఇక, ఇప్పుడు ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ బైక్ ఖరీదు అక్షరాల 18 లక్షలు.. ఇది 1160 సీసీతో నడిచే స్పోర్ట్స్ బైక్.. మూడు ఇంజిన్ల ఉండటం ఈ బైక్ ప్రత్యేకత.. దీనిని లగ్జరీ బైక్‌లకు పేరుగాంచిన ట్రయంప్ సంస్థ తయారు చేసింది. ఈ…
మూడు రోజుల క్రితం వరకు తెలంగాణవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి. అయితే రాగల 3 రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే 5 రోజులు ఉరుములు, మెరుపులతో…
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరో సాయిధరమ్ తేజ్‌కు అపోలో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సాయితేజ్ శరీరంలో అంతర్గతంగా ఎలాంటి గాయాలు కాలేదని, కాలర్‌బోన్ విరిగిందని పేర్కొన్నారు. ఆయన ఇంకా 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని… ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది.. తప్పనిసరిగా కోలుకుంటారాన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు అపోలో వైద్యులు. కాగా, నిన్న రాత్రి…
హైదరాబాద్ పీవీ ఘాట్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన థ్రిల్ సిటీ పార్క్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, సీపీ అంజనీ కుమార్ లు కూడా పాల్గొన్నారు. విదేశాల్లో మాదిరిగా అన్ని రకాల గేమ్స్ ను నిర్వాహకులు అందుబాటులోకి తెచ్చారని… థ్రిల్ సిటీ పార్క్ హైదరాబాద్ కు కానుకగా మారుతుందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అన్ని రకాల వయసుల వారికి…
దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలంటూ పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.. ఇక, వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రగతి భవన్ అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు శోభ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ – శైలిమ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్, మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య… తదితరులు పాల్గొన్నారు.…
రాజకీయంగా టీఆర్ఎస్కు కీలకమైన గ్రేటర్ హైదరాబాద్‌లో.. ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎవరికి ఛాన్స్ దక్కనుంది? సిటీలో పార్టీని బలోపేతం చేయగల నేత కోసం అన్వేషన మొదలైందా? గ్రేటర్ టీఆర్ఎస్ సారథ్యానికి రేస్‌లో ఉన్న నాయకులు ఎవరు? గ్రేటర్ టీఆర్ఎస్ కమిటీపై ఇటీవలే చర్చ! టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణానికి ఈ నెల 2 నుంచి చురుకుగా పనులు మొదలయ్యాయి. గ్రామ, వార్డు కమీటిలతోపాటు జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను ఈనెలలోనే పూర్తి చేయాలన్నది నేతల నిర్ణయం. ఈ క్రమంలోనే గ్రేటర్…
ప్రస్తుతం వాడవాడలో వినాయకులను పెడుతున్నారు.. గల్లీకో గణేష్ తరహాలు విగ్రహాలు ఏర్పాటు చేయడం.. లడ్డూ వేలం వేయడం జరుగుతోంది.. గణేష్ విగ్రహాన్ని పెట్టారంటే లడ్డూ వేలం అనేది సాధారణంగా మారిపోయింది.. కానీ, ఆ లడ్డూ వేలాన్ని ఆద్యుడు మాత్రం బాలాపూర్ గణేష్ అనే చెప్పాలి.. అయితే, కరోనా కారణంగా గత ఏడాది లడ్డూ వేలాన్ని రద్దు చేసింది బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ… ఈ తరుణంలో ఈ ఏడాది లడ్డూ వేలం ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు…
వినాయక ఉత్సవాలు, నిమజ్జనానికి హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది.. అయితే, గణేశ్ ఉత్సవాల నిర్వాహణపై తెలంగాణ, నిమజ్జనం పై ఆంక్షలు విధించింది హైకోర్టు.. ఈ నేపథ్యంలో మీడియాకు ప్రకటన విడుదల చేశారు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావ్.. హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా తమకు అందలేదన్న ఆయన.. ఈ సారి సామూహిక గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.. ఈ నెల 19న సామూహిక నిమజ్జనం ఉంటుందని.. హుస్సేన్ సాగర్…
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత సివిల్ ఏవియేషన్ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై హైదరాబాద్ నుంచి నేరుగా లండన్‌కు నాన్‌స్టాప్‌గా విమాన సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ రోజు నుంచే ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈరోజు లండన్ నుంచి ఎయిర్ ఇండియా నాన్‌స్టాప్ విమానం హైదరాబాద్ చేరుకుంటుంది. రేపు హైదరాబాద్ నుంచి లండన్‌కు నాన్‌స్టాప్ విమానం బయలుదేరుతుంది. ఇప్పటి వరకు దుబాయ్, జర్మనీ మీదుగా…
గత రెండు రోజుల నుంచి దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. తగ్గిన ధరల ప్రకారం హైదరాబాద్ నగరంలో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 తగ్గి రూ.44,100కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.48,110కి చేరింది. ఇక బంగారం బాటలోనే వెండి ధరలు కూడా దిగి వచ్చాయి. కిలో వెండి…