గెజిట్ అమలు వాయిదా వేయాలి.. తెలంగాణ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు తెరదించాలన్న ఉద్దేశంతో కృష్ణానది యాజమాన్యబోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.. దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నెల 14వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.. ఇప్పటికే రెండు బోర్డులు దీనిపై కసరత్తు చేస్తున్నాయి.. అయితే.. ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రానున్న గెజిట్ నోటిఫికేషన్ అమలు వాయిదా వేయాలని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం… గోదావరి నదిపై ఉన్న పెద్దవాగు బోర్డ్ పరిధిలోకి వెళ్తుందని.. జీఆర్‌ఎంబీ సమావేశంలో ఈ రోజు చర్చిస్తామని తెలిపారు తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్.. పెద్దవాగు పరిధిలో 2 వేల ఎకరాలు తెలంగాణకు, 13 వేల ఎకరాల ఆయకట్టు ఏపీకి ఉందన్న ఆయన.. ఏపీ కోరుతున్నట్టుగా మిగతా ప్రాజెక్టులు బోర్డ్ పరిధిలోకి ఇప్పట్లో కుదరదు అన్నారు.
ఇక, ప్రాజెక్టులకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయన్నారు రజత్ కుమార్… రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వీటిపై కేంద్రాన్ని స్వయంగా కలిసి గడువు కావాలని విన్నవించారని తెలిపిన ఆయన.. ప్రస్తుతం గోదావరి బోర్డ్ పరిధిలోకి ఒక్క పెద్దవాగు మాత్రమే వెళ్తుందని వెల్లడించారు.. ఇక, సబ్ కమిటీ నివేదికలపై ఈ రోజు జరిగే సమావేశంలో చర్చిస్తామని తెలిపారు. కాగా, ఇవాళ గోదావరి నది యాజమాన్య బోర్డు సమావేశంలో జరగనున్న సంగతి తెలిసిందే.. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలులోకి తేవాలన్న ప్రయత్నాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!