ముగిసిన ‘మా’ పోలింగ్.. కొత్త రికార్డు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్కంఠబరితంగా సాగుతోన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది… ముందుగా నిర్ణయించిన ప్రకారం.. మధ్యామ్నం 2 గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడంతో.. రెండు ప్యానెళ్లకు చెందిన.. ప్రకాష్‌రాజ్, మంచు విష్ణుతో మాట్లాడి.. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ను పొడిగించారు.. ఇక, ఈ ఏడాదిలో మా ఎన్నికల పోలింగ్ కొత్త రికార్డులను సృష్టించింది చివరి సమాచారం అందినప్పటి వరకు 665 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. అందులో 605 మంది పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటుహక్కు వినియోగించుకుంటే.. 60 మంది పోస్టల్ బ్యాలెట్ వేశారు.. మొత్తంగా రికార్డు స్థాయిలో 62 శాతానికి పైగా పోలింగ్ శాతం నమోదైంది.. గత ఎన్నికల్లో కేవలం 474 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగా.. ఈసారి రెండు ప్యానెళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. ఓటింగ్ శాతం అనూహ్యంగా పెరిగింది.. మధ్యాహ్నం 3 గంటల లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నవారికి ఓటువేసే అవకాశం కలిపిస్తున్నారు పోలింగ్ సిబ్బంది.. ఇక, పోలింగ్ ముసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇక, ఒక్కో పానెల్ నుండి ఇద్దరు మాత్రమే పోలింగ్ బూత్ లోకి రావాలని ఎన్నికల అధికారులు రెండు ప్యానెళ్లకు సూచించారు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
తాజావార్తలు
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
-
AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. ‘AA 23’పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!