తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర ప్రమాణస్వీకారం చేయించారు.. ఇవాళ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సతీష్చంద్రచే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు.. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, సీఎస్ సోమేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు… కాగా, దేశవ్యాప్తంగా 13 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్ 16న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు…
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ‘దిశ’ ఘటన సంచలనం సృష్టించింది.. హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై అప్పట్లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సజ్జనార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.. అయితే, ఈ ఘటనపై సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యుల జస్టిస్ వీఎస్ సిర్పూర్ కర్ కమిషన్ నియమించింది.. ఆ కమిషన్ విచారణ తిరిగి ప్రారంభం కానుండగా.. ఇవాళ అత్యంత కీలకంగా మారింది.. దిశ హత్యాచారం జరిగిన సమయంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న వీసీ సజ్జనార్‌ను ఇవాళ త్రిసభ్య కమిటీ…
గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం ఇప్పటికే సమావేశం అయ్యింది.. జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బీపీపాండే నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చించారు.. పెద్దవాగు ప్రాజెక్టును బోర్డు అధీనంలోకి తీసుకోవడంపై సమాలోచనలు చేవారు.. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది.. మొదటి దశలో అయిదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను…
మన ఇండియా లో బంగారానికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో పుత్తడిని కొనుగోలు చేసేవారి సంఖ్య అధికం. కరోనా కారణంగా వివాహాలు పెద్దగా హడావుడి లేకుండా సింపుల్‌గా జరుగుతున్నాయి. భారీగా వివాహాం చేసుకోవాలి అనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. కరోనా ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధర…
ఉత్కంఠబరితంగా సాగుతోన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది… ముందుగా నిర్ణయించిన ప్రకారం.. మధ్యామ్నం 2 గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడంతో.. రెండు ప్యానెళ్లకు చెందిన.. ప్రకాష్‌రాజ్, మంచు విష్ణుతో మాట్లాడి.. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్‌ను పొడిగించారు.. ఇక, ఈ ఏడాదిలో మా ఎన్నికల పోలింగ్ కొత్త రికార్డులను సృష్టించింది చివరి సమాచారం అందినప్పటి వరకు 665 మంది ఓటుహక్కు…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.. ముందుకు నిర్ణయించిన ప్రకారం.. మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉన్నా.. మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండడం, కొంత మంది ట్రాఫిక్‌లో చిక్కుకున్నట్టు సమాచారం ఇవ్వడంతో.. మరో గంటపాటు పోలింగ్ సమయాన్ని పొడిగించారు.. ప్రకాష్ రాజ్, మంచు విష్ణుతో మాట్లాడిన మా ఎన్నికల అధికారి… పోలింగ్ సమయాన్ని మధ్యాహ్నం 3 గంటల వరకు పొడిగించినట్టు ప్రకటించారు.. కాగా, ఇప్పటికే మా ఎన్నికల్లో పోలింగ్…
పింఛన్ల దరఖాస్తు గడువును మళ్లీ పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం… గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన పేదలందరికీ ఆసరా వృద్ధాప్య పింఛన్లు అందించడానికి సిద్ధం అవుతుతోన్న సర్కార్.. అందులో భాగంగా ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది.. ప్రభుత్వం పెట్టిన గడువు ప్రకారం.. గత నెలలోనే గడువు ముగిసిపోగా.. మరో అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు సీఎస్ సోమేష్ కుమార్.. మీసేవ కేంద్రాల్లో ఈ నెల 11వ తేదీ…
తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల నుండి అనేక కంపెనీలు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 14లో క్రిస్సమ్ -ఫర్నీచర్, ఇంటీరియర్ షోరూంను ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్ఐపాస్, సింగిల్ విండో అనుమతులు లాంటి అనేక చర్యలతో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.…
తెలంగాణలో జనసైనికులతో పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. చాలా రోజుల తరువాత తెలంగాణలో కార్యకర్తలతో, నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009 లో తెలంగాణలో సంపూర్ణంగా తిరిగానని అన్నారు. తనను దెబ్బకొట్టేకొద్దీ మరింత ఎదుగుతానని తెలిపారు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ తెలిపారు. ఈ నేల తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. బలమైన సామాజిక మార్పుకోసం ప్రయత్నిస్తానని అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు…
తెలుగు అకాడమీ కేసులో సీసీఎస్ పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నేడు మరో నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఇప్పటికే యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ ని మూడు రోజుల పాటు విచారించారు పోలీసులు.. ఇదే కేసులో అరెస్ట్ అయినఏపీ మర్కంటైల్ సొసైటీ ఛైర్మన్ సత్యనారాయణ, మేనేజర్ పద్మావతి, క్లర్క్ మొహిద్దిన్ లను నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. అటు ఈ కేసులో ముగ్గురు నిందితులను 4 రోజుల కస్టడీ కి…