ప్రయాణికులకు శుభవార్త చెప్పింది హైదరాబాద్ మెట్రో రైల్.. ప్రయాణికుల కోసం మెట్రో సువర్ణ ఆఫర్ పేరుతో కొత్త ఆఫర్ను తీసుకొచ్చింది… అంటే ఇది ట్రిప్ పాస్ ఆఫర్… దీనికి నిర్ణీత సమయం కూడా ఉంది… 45 రోజుల కాలంలో 20 ట్రిప్పులకు సరిపడా డబ్బులు చెల్లించి.. 30 ట్రిప్పులను పొందే అవకాశాన్ని ఈ ట్రిప్ పాస్ ద్వారా కల్పిస్తుంది హైదరాబాద్ మెట్రోల్ రైల్.. ఇక, నెలలో 20 మెట్రో ట్రిప్స్ కన్నా అధికంగా ప్రయాణించే ప్రయాణికుల కోసం…
ఇండియా లోనే కాదు… ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతు న్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44, 160 కి…
దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు పయనమయ్యారు హైదరాబాద్ నగరవాసులు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. కాలేజీలకు కూడా సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు కూడా సొంత ఊర్లకు వెళ్తున్నారు. అయితే రద్దీకి తగ్గట్టు రైళ్లను నడపడం లేదని వాపోతున్నారు ప్రయాణికులు. కోవిడ్ కారణంగా నిలిపివేసిన రైళ్లు సైతం పూర్తి స్థాయిలో నడపటం లేదని చెబుతున్నారు. రెండు నెలల ముందు రిజర్వేషన్ చేసుకుంటేనే కానీ రైలులో ప్రయాణం చేయలేకపోతున్నమని, అప్పటికప్పుడు వెళ్ళాలంటే సాధారణ రైళ్లు లేక చాలా…
హైదరాబాద్ ఓల్డ్ సిటీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య ఘటన కలకలం సృష్టించింది.. చాంద్రాయణగుట్ట నుంచి హీషీమాబాద్ వైపు కారులో వెళ్తున్న హమీద్ అనే వ్యక్తిని వెంబడించిని గుర్తు తెలియని వ్యక్తులు కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న హమీద్ను బయటకు లాగి నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనతో పాతబస్తీలో భయాందోళనకు నెలకొన్నాయి.. అయితే,…
తెలంగాణలో ఎంగిలిపూవు బతుకమ్మతో ప్రారంభమైన బతుకమ్మ పండుగ.. ఇవాళ సద్దుల బతుకమ్మ ఉత్సవాలతో ముగియనున్నాయి.. ఇక, ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుగుతున్నాయి.. ఈ తరుణంలో పూల పండుగ బతుకమ్మ చివరి రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజులుగా ప్రకృతిని ఆరాధిస్తూ, పూలతో బతుకమ్మను పేర్చి తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాల ఘనంగా జరుపుకోవడంపై సంతోషం…
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రమంగా జడ్జీల నియామకంపై ఫోకస్ పెట్టారు.. సుప్రీంకోర్టు నుంచి వివిధ రాష్ట్రాల హైకోర్టుల వరకు జడ్జీల నియామక ప్రక్రియ కొనసాగుతోంది.. తాజాగా. తెలంగాణ హైకోర్టుకు ఏడుగురు జడ్జీలను నియమించారు.. సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసిన ఏడుగురిని తెలంగాణ హైకోర్టు జడ్జీలుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జుడిషియల్ ఆఫీసర్లయిన శ్రీసుధా, సి. సుమలత, జి. రాధా రాణి, ఎం. లక్ష్మణ్,…
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోంది.. కొన్ని సార్లు ప్రత్యేక డ్రైవ్ ద్వారా విస్తృతంగా వ్యాక్సిన్ వేస్తున్నారు అధికారులు.. అయితే, బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో మరికొన్ని రోజులు వ్యాక్సినేషన్కు సెలవులు ప్రకటించారు అధికారులు.. రేపు అనగా 14వ తేదీన వాక్సినేషన్ కు సెలవు ఇవ్వాలని వైద్య, ఆరోగ్య సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.. ఈ మేరకు, 14వ తేదీన వాక్సినేషన్ కార్యక్రమానికి విరామం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ను…
టీఆర్ఎస్ పార్టీలో పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ, మండల, పట్టణ కమిటీలు పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అనుబంధ సంఘాలు కూడా ఏర్పాటైనట్టు కేటీఆర్ తెలిపారు. 2019 ఎన్నికల కారణంగా పార్టీ ప్లీనరీ కార్యక్రమం నిర్వహించలేకపోయామని, ఆ తరువాత కరోనా కారణంగా రెండేళ్లపాటు ప్లీనరీని నిర్వహించలేదని, నవంబర్ 15న వరంగల్లో విజయగర్జన జరుగుతుందని అన్నారు. ఇక పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నికలను నిర్వహించబోతున్నట్టు కేటీఆర్ తెలిపారు. అక్టోబర్ 17 వ తేదీన ఎన్నికల షెడ్యూల్ రిలీజ్…
గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి. పండుగ సీజన్ కావడంతో బంగారం కొనుగోలు చేసేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపుతుంటారు. ఈ సమయంలో బంగారం ధరలు పెరగడం కొంత ఇబ్బందులు తీసుకొచ్చే అంశంగా చెప్పుకోవాలి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ.44,150కి చేరింది. 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం…