పచ్చని కాపురాలలో వివాహేతర సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. ప్రేమించిన వారే మరొకరి మోజులో కట్టుకున్న వారిని హతమారుస్తున్నారు. తాజాగా ఒక భార్య, ప్రియుడి మీద మోజు తో కట్టుకున్న భర్తను అతికిరాతకంగా హతమార్చింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. రాజేంద్రనగర్, శివరాంపల్లికి చెందిన షేక్ ఆదిల్ అలియాస్ నరేష్ (35) పాల వ్యాపారం చేస్తుంటాడు. అతనికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య జోయాబేగం సైదాబాద్ మోయిన్‌బాగ్‌లో నివాసముంటోంది. భర్త తరుచూ ఇంటికి రాకపోవడంతో ఆమె.. ఇంటి పక్కన ఉండే సోహైల్ (25) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త లేని సమయంలో అతడిని ఇంటికి తీసుకొచ్చి శృంగార కార్యకలాపాలు సాగించేది.
ఇక ఇటీవల ఈ విషయం భర్తకు తెలియడంతో ఆమెను మందలించాడు. ప్రియుడిపై మోజు పెంచుకున్న జోయా, అతడిని వదలలేక భర్తను హతమార్చడానికి ప్లాన్ వేసింది. ఇదే విషయాన్ని ప్రియుడకు తెలిపింది. తన భర్త బతికివుంటే మనమిద్దరం కలిసి ఉండలేమని తెలుపడంతో.. ప్రియుడు తన ముగ్గురు స్నేహితులు ముహమ్మద్ రియాజ్, షేక్ మావియా, మహ్మద్ జహీర్‌ను పిలిచి హత్యకు ప్లాన్ రెడీ చేశాడు. ఈ నెల 19 న నరేష్ నిద్రపోతుండగా నలుగురు అతని మెడకు చున్నీతో ఉరి బిగించి, కత్తితో పొడిచి హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని ఆటో ట్రాలీలో పహాడీ షరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రదేశంలో మృదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టారు.ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు భార్యనే నిందితురాలు అని నిర్దారించారు. మృతుడి భార్య, ఆమె ప్రియుడితో పాటు హత్యకు సహకరించిన ముగ్గురినీ అరెస్టు చేసి శనివారం రిమాండ్ కి తరలించారు.