తెలంగాణలో చలి పెరగనుంది. ఈశాన్య భారతం నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో చలి పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ సాయిలో నమోదవుతున్నాయని, ఎక్కడా పెద్దగా మార్పులు లేవని వివరించింది. అటు రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయని తెలిపింది.
Read Also: చలికాలం చర్మ సంరక్షణ ఎలా?
శుక్రవారం రాత్రి ఆదిలాబాద్‌లో 16.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈనెల 9,10 తేదీల మధ్య తమిళనాడులో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని.. అప్పటివరకు కొంత చలి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. చలి పెరగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగుజాగ్రత్తలు పాటించాలని సూచించారు.