కరోనా మరోసారి పంజా విసురుతోంది.. క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది.. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను కూడా కరోనా వైరస్ పలకరించింది.. తాజాగా, తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. స్వల్ప లక్షణాలతో బాధపడుతోన్న ఆయనకు తాజాగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చింది.. అయితే, ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఏజీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి..…
తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోన్న సమయంలో.. మళ్లీ కఠిన ఆంక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే వైద్యారోగ్యశాఖ సూచనలతో ఈ నెల 30వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ సోమేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్‌పై తాజా పరిస్థితులపై చర్చించిన ఆయన.. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇదే సమయంలో..…
కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతోన్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది… విద్యా సంస్థలకు సెలవులు పొడిగించాలని నిర్ణయానికి వచ్చింది.. రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ఇవాళ్టితో ముగియనుండగా.. రేపటి నుంచి స్కూళ్లు, విద్యాసంస్థలు ప్రారంభం కావాల్సి ఉంది.. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.. వాటిని నిజం చేస్తూ.. ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థల…
రాజధాని హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నట్టుండి భారీ వర్షం కురిసింది.. కొన్ని ప్రాంతాల్లో 14 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది.. నల్లగొండ, సూర్యాపేట, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి… అత్యధికంగా సూర్యాపేట జిల్లా ఎర్కరాంలో 14.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో 11.7 సెంటీ మీటర్లు, మేడ్చల్ జిల్లా కాప్రాలో 11.6 సెం.మీ., రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో 9 సెం.మీ. నమోదు అయ్యింది..…
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో చిన్నజీయర్ స్వామిని కేంద్ర పర్యాటకశాఖమంత్రి కిషన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం కలిశారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి ఆశీస్సులను ఆయన తీసుకున్నారు. అనంతరం ఫిబ్రవరిలో జరగనున్న రామానుజ శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల వివరాలను చిన్నజీయర్ స్వామిని అడిగి కిషన్‌రెడ్డి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా పాల్గొన్నారు. వీరి సమావేశం సుమారు 40 నిమిషాల పాటు జరిగింది. Read Also: ఎలాన్ మస్క్‌ని ఆహ్వానించిన…
శతాబ్దపు ఘన చరిత్ర కలిగిన కోఠి ఉమెన్స్ కాలేజ్ కు మహిళా విశ్వ విద్యాలయం హోదా త్వరలోనే దక్కనుంది. దీని కోసం గతంలోనూ కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు చేయగా… కార్యరూపం దాల్చలేదు. కానీ.. ఈ విడత సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ నుంచి ఈ ప్రతిపాదన రావడంతో కోఠి ఉమెన్స్ కాలేజీ యూనివర్సిటీ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో కేటీఆర్ తాజాగా కోఠి మహిళా యూనివర్సిటీ ప్రతిపాదనను చర్చకు…
ప్రముఖ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి(96) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1925లో ఆగస్టు 28న గుంటూరు జిల్లా క్రోసూరులో చంద్రశేఖరశాస్త్రి జన్మించారు. పురాణ ప్రవచనాలు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటిగా పేరు, ప్రఖ్యాతులు పొందారు. భద్రాచలం శ్రీ సీతారామ కల్యాణ వేడుకల ప్రత్యక్ష వ్యాఖ్యానాలలో ఆయన ఉషశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఉగాది పంచాంగ శ్రవణం, పురాణ ఇతిహాసాలను ప్రజలకు సులభంగా అర్థం అయ్యేలా ప్రవచనాలు చేయడంతో చంద్రశేఖరశాస్త్రి చాలా ప్రసిద్ధి.…
హైదరాబాద్ కూకట్పల్లి వెంకట్రావునగర్లోని ఓ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇంటి కిటికీలు, తలుపులు, ఇతర విలువైన సామాగ్రి ధ్వంసమయ్యాయి. ఫ్రిజ్ నుంచి కంప్రెసర్ గ్యాస్ లీక్ కావడంతోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు…
కరోనా మళ్లీ భారత్‌ను వణికిస్తోంది.. థర్డ్ వేవ్ దెబ్బకు రికార్డు స్థాయిలో రోజువారి కేసులు పెరుగుతూ పోతున్నాయి.. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు విధిస్తున్నాయి.. మరోవైపు, వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పైకి కదులుతోంది.. ఇప్పటి వరకు తెలంగాణలో సాధారణ కోవిడ్ నిబంధనలు తప్పితే.. అదనంగా ఎలాంటి ఆంక్షలు లేవు.. అయితే, దీనిపై మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు నెటిజన్లు..…