తెలంగాణలో కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతూనే ఉంది.. మూడున్నవేలకు పైగానే మరోసారి కేసులు నమోదు అయ్యాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 3,603 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో వ్యక్తి కోవిడ్ బారినపడి మృతిచెందగా.. ఇదే సమయంలో 2,707 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,34,815కు చేరగా.. మొత్తం రికవరీ కేసులు 6,98,649కు పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 4072కు పెరిగింది.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 93,397 శాంపిల్స్ పరీక్షించామని.. ఇప్పటివరకు చేసిన టెస్ట్‌ల సంఖ్య 3,13,78,819గా ఉందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.
Read Also: ఐఏఎస్ క్యాడర్ రూల్స్ మార్చొద్దు.. కేంద్రంపై పెరుగుతున్న ఒత్తిడి