కరోనా కేసుల విజృంభణ మళ్లీ కొనసాగుతుండడంతో.. అంతా ఆన్లైన్ బాట పడుతున్నారు.. ఇప్పటికే ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో.. ప్రైవేట్ విద్యా సంస్థలు ఇవాళ్టి నుంచే ఆన్లైన్ బోధనను తిరిగి ప్రారంభించాయి.. మరోవైపు.. న్యాయస్థానాల విధుల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ హైకోర్టు.. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో వెంటనే అన్ని కేసులను ప్రత్యక్ష విచారణ నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది..…
తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలకు మద్దతు ఇవ్వండి.. అవి దేశ వృద్ధి రేటుకు కూడా ఉపయోగడతాయని తెలిపారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన గతి శక్తి సౌత్ జోన్ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కేటీఆర్… మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మాస్యూటికల్స్, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్, పవర్, బొగ్గు రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను ప్రస్తావించారు.. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో 35 శాతం హైదరాబాద్‌లోనే జరుగుతోందన్న ఆయన.. భౌగోళిక…
గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది.. కరోనా మహమ్మారి రాష్ట్రంలో అడుగుపెట్టిననాటి నుంచి గాంధీ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సేవలు మరువలేనివి.. కనిపించని మహమ్మారిపై ముందుండి పోరాటం చేస్తున్నారు.. గాంధీని కోవిడ్ ఆస్పత్రిగా మార్చి సేవలు అందిస్తోంది ప్రభుత్వం.. ఇదే సమయంలో.. పెద్ద సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది కూడా కోవిడ్ బారినపడుతుండడంతో.. మిగతా వారిలో ఆందోళన మొదలైంది.. తాజాగా.. మరో 120 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.. వీరిలో 40 మంది…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి మీడియా ముందుకు రానున్నారు.. కరోనా సమయంలో కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడుతున్నారంటే.. ఆయన ఏం చెబుతారు..? ఎలాంటి ఆంక్షలు పెడతారు..? కేసుల పరిస్థితి ఏంటి? అనేదానిపై అంతా ఆసక్తిగా ఎదురుచూసేవారు.. ఇప్పుడు మళ్లీ కోవిడ్ విజృంభిస్తోంది.. ఓవైపు ఒమిక్రాన్.. మరోవైపు డెల్టా కేసులు వరుసగా పెరుగుతూ పోతున్నాయి.. ఈ నేపథ్యంలో.. కోవిడ్ తాజా పరిస్థితి, మహమ్మారి విజృంభిస్తే.. ఎదుర్కోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం కేసీఆర్.. ప్రగతి భవన్లో…
తెలంగాణ పోలీస్ శాఖను కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఎవరో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలు అందించిన పోలీసులు కరోనా బారిన పడుతుండటం బాధాకరమని చెప్పాలి. కరోనా థర్డ్ వేవ్‌లో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 500 మంది పోలీసులు కరోనా బారిన పడినట్లు అధికారులు చెప్తున్నారు. Read Also: విద్యార్థులకు అలర్ట్.. ఈనెల 30 వరకు అన్ని పరీక్షలు వాయిదా…
సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రజలు పల్లెల నుంచి పట్నం బాట పట్టారు. దీంతో స్వగ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్‌కు పయనం అయ్యారు. సోమవారం నుంచి ఆఫీసులు తెరుచుకోవడంతో ఉద్యోగులు సొంతూళ్ల నుంచి హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. Read Also: పశువుల పండగలో విషాదం.. పొట్టేలుకు బదులు మనిషి బలి సాధారణ రోజుల్లో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే వాహనాల రాకపోకలు సోమవారం రెట్టింపు స్థాయిలో ఉన్నాయని…
సంక్రాంతికి నగరం నుంచి వేలాది మంది సొంతూళ్లకు వెళ్లారు. నగరంలో మూడు రోజులపాటు ట్రాఫిక్ రద్దీ చాలా తగ్గిపోయింది. అయితే, సగం నగరం ఖాళీ అయినప్పటికీ సంక్రాంతి వేడుకలు నగరంలో ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి పండగకు రికార్డ్ స్థాయిలో చికెన్ సేల్స్ జరిగింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు మూడు రోజుల వ్యవధిలో రికార్డ్ స్థాయిలో 60 లక్షల కిలోల చికెన్ సేల్స్ జరగింది. సాధారణంగా గ్రేటర్ పరిధిలో రోజుకు 10 లక్షల కిలోల చికెన్…
హైదరాబాద్ నల్లగండ్ల అపర్ణ సరోవర్‌లో విషాదం నెలకొంది. చదువుకోమని తండ్రి మందలించడంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. చందానగర్ పీఎస్ పరిధిలోని నల్లగండ్ల అపర్ణ సరోవర్ సీ బ్లాక్ 14వ ఫ్లోర్లో అమిత్ కుటుంబం నివాసం ఉంటోంది. అమిత్ కుమారుడు అద్వైత్ (13) 8వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం అల్లరి చేస్తున్న విద్యార్థి అద్వైత్ను తండ్రి మందలించాడు. చదువుకోమని గట్టిగా అరిచాడు. దీంతో మనస్తాపం చెందిన అద్వైత్… 14వ…
హైదరాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని సుభాష్ నగర్ బస్టాప్ వద్ద బిద్యాధర్ (32) అనే వ్యక్తి ఏడాది నుంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. అతడి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పక్కనే యాసిన్ అనే వ్యక్తి పాన్ షాప్ నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి 10:30 గంటలకు బిద్యాధర్ వద్దకు వెళ్లిన యాసిన్ తనకు ఫాస్ట్ ఫుడ్ కావాలని అడిగాడు. రాత్రి అయినందున తాను షాపును మూసివేస్తున్నానని.. ఫాస్ట్ ఫుడ్ లేదని బిద్యాధర్ చెప్పాడు.…