తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతూ పోతోంది.. కొన్ని సార్లు కాస్త తగ్గినా కోవిడ్ ఉధృతి మాత్రం కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే చాలా మంది ప్రముఖులను కోవిడ్ టచ్ చేసింది.. సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్లతో పాటు పలువురు కోవిడ్ బారినపడగా.. మరోవైపు రాజకీయ నేతలను కూడా కోవిడ్ వదలడం లేదు.. తాజాగా, తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణకు కరోనా పాజిటివ్‌గా తేలింది… దీంతో హైదరాబాద్‌లోని ఏఐజీలో…
నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఎంట్రెన్స్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. నూమాయిష్ ఎంట్రన్స్ దగ్గర ఉన్న భారీ చెట్టు ఒక్క సారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో చెట్టు కింద పార్కింగ్ చేసిన పలు వాహనాలు దెబ్బతిన్నాయి. చెట్టు కూలడంతో ఏడు బైకులు, మూడు కార్లు ధ్వంసం అయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు కలిసి చెట్టు కొమ్మలు తొలగించి, వాహనాలు బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. Read Also: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం చెట్టు కూలిన సమయంలో…
తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి పలు చోట్ల వర్షం కురిసింది. కూకట్ పల్లి, హైదర్‌నగర్, అల్విన్ కాలనీ, మియాపూర్, చందానగర్, కుత్బుల్లాపూర్ , గాజుల రామారం, జీడిమెట్ల, షాపూర్‌నగర్, సూరారం, సికింద్రాబాద్, తిరుమలగిరి, బోయినపల్లి, అల్వాల్, మారేడుపల్లి, బేగంపేట, ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కాగా రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ…
శంషాబాద్ విమనాశ్రయంలో అక్రమంగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన మగ్గురు మహిళల నుంచి 1.48కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ అక్రమ బంగారం రవాణా గుట్టు. వీరిపై కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేశారు. బంగారం విలువ సుమారు రూ.72.80 లక్షల విలువ ఉంటుందని పేర్కొన్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ఫ్లైట్ ద్వారా వచ్చిన మహిళలు పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని ఎవ్వరికి…
సంక్రాంతి పండగ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై హైదరాబాద్ రవాణా శాఖ అధికారులు దాడులు చేశారు.9 బృందాలతో దాడులు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని శివార్లలో పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా, సరైన పర్మిట్లు లేకుండా, ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తూ పొరుగు రాష్ట్రాల మధ్య తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. Read Also: తెలంగాణలో కొత్తగా..1920 కరోనా కేసులు ప్రధానంగా ప్రయివేట్ వాహనాలు స్టేజీ…
వైద్యం చేసి ప్రాణాలు నిలిపేవారే కరోనా బారిన పడుతున్నారు. హైదరాబాద్ లో కరోనా తీవ్రత రానురాను పెరుగుతోంది. తాజాగా గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో సిబ్బందికి, విద్యార్థులకు కరోనా సోకింది. గాంధీ ఆస్పత్రిలో 44 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 20 మంది మెడికోలు, 10 మంది హౌస్ సర్జన్స్, 10 మంది పీజీ స్టూడెంట్లు, నలుగురు అధ్యాపకులు ఉన్నారు. వీరందరినీ ఐసోలేషన్లలో చికిత్స అందిస్తున్నారు.. దీంతో హాస్పిటల్లో పని చేస్తున్న మిగతా…
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు.. ఇప్పటికే పలవురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడగా.. తాజాగా, రాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. తెలంగాణ విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి తాజాగా కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని.. పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది మంత్రి జగదీష్‌రెడ్డి వెల్లడించారు.. వైద్యుల సూలచన మేరకు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు వెల్లడించారు.. అంతే కాదు, ఈ మధ్య తనను కలిసినవారంతా కరోనా…
హైదరాబాద్‌లోని అంతర్జాతీయ గాలిపటాలు, స్వీట్ ఫెస్టివల్‌ను ఈ ఏడాది రద్దు చేశారు. కోవిడ్-19 కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో వరుసగా రెండో ఏడాది కూడా నగరంలో మూడు రోజుల అంతర్జాతీయ గాలిపటాలు స్వీట్ ఫెస్టివల్‌ను నిలిపి వేస్తున్నట్టు నిర్వాహకులు అధికారికంగా తెలిపారు. జనవరి 14 నుంచి 16 వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ ఈవెంట్ జరగాల్సి ఉంది. మత, రాజకీయ, సాంస్కృతిక సహా అన్ని రకాల ర్యాలీలు, బహిరంగ సభలు మరియు సామూహిక సభలపై నిషేధం…
సైబర్ నేరగాళ్ళ మోసాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రూపంలో అమాయకులు నుండి అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా సీసీఎస్ సైబర్ క్రైం టీమ్ లు రెండు ముఠాల గుట్టు రట్టు చేశాయి..ఉద్యోగాల పేరుతో, బహుమతుల పేరుతో మోసాలు చేస్తున్న రెండు సైబర్ గ్యాంగ్ లను అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.. ఢిల్లీ లోని ఓ కాల్ సెంటర్ పై రైడ్ చేసి 10 మందిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నైజీరియన్లను…