హైదరాబాద్‌లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది… రాత్రి కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసినా.. ఆ తర్వాత మళ్లీ సాధారణ వాతావరణం నెలకొంది.. చలి కూడా తీవ్రంగానే ఉంది.. అయితే, ఉదయం వాతావరణ మారిపోయింది.. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.. ఇవాళ ఉదయం నుంచి ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, చైతన్య పురి, కొత్తపేట్, సరూర్ నగర్. కర్మన్ ఘాట్, రాజేంద్రనగర్, హైదర్‌గూడ, అత్తాపూర్, నార్సింగి మణికొండ, పుప్పాలగూడ సహా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.. ఇక,…
పంజాబ్‌లో ప్రధాని మోదీ భద్రత అంశం విషయంలో బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను ఉద్దేశిస్తూ హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా హీరో సిద్ధార్థ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైనాపై సిద్ధార్థ్ అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని హైదరాబాద్ బంజారాహిల్స్‌కు చెందిన సామాజిక కార్యకర్త ప్రేరణ తిరువాయ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సిద్ధార్థ్‌పై సెక్షన్ 67 యాక్టు, ఐపీసీ…
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 72 ఏళ్ల వృద్ధుడు 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం గాదె వీరారెడ్డి (72) అనే వ్యక్తి… బర్కత్‌పురలోని గోకుల్ధామ్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నాడు. 2010లో అతడి ఇంట్లో బాధితురాలి తల్లి పని మనిషిగా పని చేసేది. 2017లో ఆమెను బడంగ్‌పేటలోని తన ఓపెన్ ప్లాట్‌కు వాచ్‌మెన్‌గా నియమించుకున్నాడు. ఆ తర్వాత బాధితురాలి తల్లి, ఆమె మేనమామ ఇద్దరూ కలిసి…
సంక్రాంతి సంబరం మొదలైంది. ఇప్పటికే చాలా మంది సొంత ఊర్లకు వివిధ మార్గాల ద్వారా చేరుకున్నారు. ఇంకా చేరుకుని వారికోసం టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను నడుపుతుంది. అయితే ఆయా ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా టీఎస్ ఆర్టీసీ వారి గమ్య స్థానాలను చేర్చేందకు బస్సు పాయింట్లను ప్రకటించింది. రాయలసీమ ప్రాంతాలకు వెళ్లే బస్సులు సెంట్రల్ బస్ స్టేషన్ (సీబీఎస్) నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. ఆంధ్రా ప్రాంతానికి వెళ్లే బస్సులు…
కరోనా మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. చిన్న, పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులకు సైతం కరోనా సోకింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు. Read Also: కేసీఆర్‌ను టచ్ చేసి చూడండి.. వేముల ప్రశాంత్‌రెడ్డి సవాల్ కాగా తనతో సన్నిహితంగా ఉన్నవారు టెస్టులు చేయించుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని…
బంజారాహిల్స్‌లో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ 20 అంతస్తుల నిర్మాణం కమాండ్ కంట్రోల్ సెంటర్ సి.పి. హైదరాబాద్ కార్యాలయంగా పని చేయడమే కాకుండా సంక్షోభ నివారణ కేంద్రంగా మారబోతుందని తెలిపారు. 4 టవర్ల భవనం, 20 అంతస్తుల మొత్తం ప్రణాళికను మ్యాప్‌లను అధికారులు సీపీకి వివరించారు. Read Also: మరో కొత్త పథకానికి కేసీఆర్ సర్కార్…
సంక్రాంతి పండగ సందర్భంగా హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనం అవుతున్నారు. మూడు రోజులు నిర్వహించుకునే పండగ కావడంతో చాలా మంది వారం రోజుల పాటు స్వగ్రామాలలో గడిపేందుకు ఊరికి వెళ్తున్నారు. అయితే ఇలాంటి సమయం కోసం వేచిచూస్తున్న దొంగలు పలు చోట్ల రెక్కీలు నిర్వహిస్తున్నారు. దోపిడీలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో రాచకొండ పోలీసులు ప్రజలకు కొన్ని సూచనలు జారీ చేశారు . తాము ప్రజలను ఊరెళ్లొద్దని చెప్పడం లేదు కానీ, ఇంటికి…
ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికతకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, ఉద్యోగులతో కలిసి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 317ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ నేతల ఆందోళనతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎమ్మెల్యే సీతక్కను బలవంతంగా అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. Read…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు ఇవాళ నోటీసులు అందజేశారు ఏపీ సీఐడీ అధికారులు… గతంలో ఆయనపై నమోదైన కేసులకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఐడీ అధికారులు రఘురామ కృష్ణరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.. రఘురామకృష్ణరాజుపై 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ.. ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వచ్చి…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి మరోసారి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వెళ్లారు ఏపీ సీఐడీ అధికారులు.. గతంలో రఘురామను విచారించిన సీఐడీ, ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కాగా.. మరోసారి సీఐడీ పోలీసుల విచారణకు రావాలని రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చినట్టుగా చెబుతున్నారు.. రేపు సీఐడీ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇవ్వనున్నట్టుగా సమాచారం.. మరి సీఐడీ నోటీసుల్లో ఏముందో..?…