ప్రధాని మోడీ హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్షను నిర్వహించారు. ప్రధాని టూర్ ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్‌ను సక్సెస్ చేయాలని సమీక్షలో అధికారులను ఆదేశించారు. భద్రతకోసం అవసరమైన ఏర్పాట్లను చేయాలని, కోవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు జరగాలని అన్నారు. టూర్‌లో పాల్గొనేవారి వద్ద ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉండాలని అన్నారు. ఈనెల 5 వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్‌లో జరిగే రెండు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఇక్రిశాట్ లో జరుగుతున్న స్వర్ణోత్సవాల్లోనూ, శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ చినజీయర్ స్వామివారి ఆశ్రమంలో నిర్వహిస్తున్న శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాల్లోనూ ప్రధాని పాల్గొననున్నారు. ముచ్చింతల్‌లోని సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు.
Read: విచిత్రం: ఆ నగరంలో కార్లను లాక్ చేయరు… ఇదే కారణం…