తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. అయితే, గత బులెటిన్‌తో పోలిస్తే మాత్రం.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గగా.. తెలంగాణలో మాత్రం స్వల్పంగా పెరిగాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 30,886 శాంపిల్స్ పరీక్షించగా 4,198 మందికి పాజిటివ్గా తేలింది.. మరో ఐదుగురు మృతి చెందారు, ఇదే సమయం 9,317 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. ప్రస్తుతం రాష్ట్రంలో 88,364 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. ఇక, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,97,369కు చేరుకోగా.. రికవరీ కేసులు 21,94,359కు పెరిగాయి.. మృతుల సంఖ్య 14,646కు పెరిగింది.
Read Also: చావంటే భయం లేదు.. జడ్ కేటగిరీ సెక్యూరిటీ అక్కరలేదు..!
మరోవైపు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2,387 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,74,215కు పెరిగింది.. ఇక, 4,559 మంది పూర్తిస్థాయిలో కోలుకోవడంతో.. రికవరీ కేసుల సంఖ్య 7,39,187కు చేరింది.. మరో కోవిడ్ బాధితుడు ప్రాణాలు వదలడంతో.. మృతుల సంఖ్య 4,097కు పెరిగింది.. ప్రస్తుతం రాష్ట్రంలో 30,931 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 79,561 శాంపిల్స్ పరీక్షించామని.. ఇంకా 2,239 శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొంది.