శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు 2వ రోజుకి చేరుకున్నాయి. సేవకాలంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువు ప్రారంభం. ముందుగా అగ్ని ఆవాహన కార్యక్రమం…శమి, రావి కర్రలతో అగ్ని మధనం.1035 కుండాలతో శ్రీ లక్ష్మీ నారాయణ యాగం. యాగ మహా క్రతువులో పాల్గొననున్న 5 వేల మంది ఋత్విక్కులు. ప్రవచన శాలలో వేద పండితులచే ప్రవచన పారాయణం వుంటుంది.