హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో చిన్నజీయర్ స్వామిని కేంద్ర పర్యాటకశాఖమంత్రి కిషన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం కలిశారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి ఆశీస్సులను ఆయన తీసుకున్నారు. అనంతరం ఫిబ్రవరిలో జరగనున్న రామానుజ శతాబ్ది ఉత్సవాల ఏర్పాట్ల వివరాలను చిన్నజీయర్ స్వామిని అడిగి కిషన్‌రెడ్డి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు కూడా పాల్గొన్నారు. వీరి సమావేశం సుమారు 40 నిమిషాల పాటు జరిగింది. Read Also: ఎలాన్ మస్క్‌ని ఆహ్వానించిన…
శతాబ్దపు ఘన చరిత్ర కలిగిన కోఠి ఉమెన్స్ కాలేజ్ కు మహిళా విశ్వ విద్యాలయం హోదా త్వరలోనే దక్కనుంది. దీని కోసం గతంలోనూ కేసీఆర్ సర్కార్ ప్రయత్నాలు చేయగా… కార్యరూపం దాల్చలేదు. కానీ.. ఈ విడత సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ నుంచి ఈ ప్రతిపాదన రావడంతో కోఠి ఉమెన్స్ కాలేజీ యూనివర్సిటీ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రి వర్గ ఉప సంఘం సమావేశంలో కేటీఆర్ తాజాగా కోఠి మహిళా యూనివర్సిటీ ప్రతిపాదనను చర్చకు…
ప్రముఖ ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖరశాస్త్రి(96) శుక్రవారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1925లో ఆగస్టు 28న గుంటూరు జిల్లా క్రోసూరులో చంద్రశేఖరశాస్త్రి జన్మించారు. పురాణ ప్రవచనాలు చెప్పడంలో ఆయనకు ఆయనే సాటిగా పేరు, ప్రఖ్యాతులు పొందారు. భద్రాచలం శ్రీ సీతారామ కల్యాణ వేడుకల ప్రత్యక్ష వ్యాఖ్యానాలలో ఆయన ఉషశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఉగాది పంచాంగ శ్రవణం, పురాణ ఇతిహాసాలను ప్రజలకు సులభంగా అర్థం అయ్యేలా ప్రవచనాలు చేయడంతో చంద్రశేఖరశాస్త్రి చాలా ప్రసిద్ధి.…
హైదరాబాద్ కూకట్పల్లి వెంకట్రావునగర్లోని ఓ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంట్లో ఉన్న వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఇంటి కిటికీలు, తలుపులు, ఇతర విలువైన సామాగ్రి ధ్వంసమయ్యాయి. ఫ్రిజ్ నుంచి కంప్రెసర్ గ్యాస్ లీక్ కావడంతోనే పేలుడు సంభవించినట్లు పోలీసులు నిర్ధారించారు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు…
కరోనా మళ్లీ భారత్‌ను వణికిస్తోంది.. థర్డ్ వేవ్ దెబ్బకు రికార్డు స్థాయిలో రోజువారి కేసులు పెరుగుతూ పోతున్నాయి.. దీంతో అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు.. కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు విధిస్తున్నాయి.. మరోవైపు, వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెడుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పైకి కదులుతోంది.. ఇప్పటి వరకు తెలంగాణలో సాధారణ కోవిడ్ నిబంధనలు తప్పితే.. అదనంగా ఎలాంటి ఆంక్షలు లేవు.. అయితే, దీనిపై మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించారు నెటిజన్లు..…
మహా నగరం హైదరాబాద్ విస్తరిస్తూనే ఉంది… ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో భారీ స్థాయిలో కొత్త వెంచర్లు వస్తూనే ఉన్నాయి.. ప్లాట్లు, ఇళ్లు ఇలా రెగ్యులర్‌గా క్రయ విక్రయాలు సాగుతూనే ఉన్నాయి.. ప్రతిష్టాత్మక సంస్థలు రంగంలోకి దిగి విల్లాలు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌస్‌లు.. ఇలా అనేక రకాలుగా బిజినెస్ చేస్తున్నాయి.. కొన్ని చోట్ల ఇప్పటికే ఓఆర్ఆర్ను దాటేసి రియల్ ఎస్టేట్ జోరుగా సాగుతోంది… రీజనల్ రింగ్ రోడ్డు కూడా రానుండడంతో.. దానిని దృష్టిలో పెట్టుకుని కూడా బిజినెస్…
సంక్రాంతిని పురస్కరించుకొని ప్రయాణీకులు తమ స్వంత ఊళ్లకు బయలు దేరారు. అయితే ప్రభుత్వం 8వ తేది శనివారం నుంచే విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించగా 9వ తేది ఆదివారం ఉదయం నుంచే విజయవాడ-హైద్రాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. కాగా 13 గురువారం కూడా కిలో మీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి లోట్ ప్లాజా, విజయవాడకు సమీపంలోని పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద…
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మరోసారి బహిరంగ లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.. రైతాంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మీరు రాసిన బహిరంగ లేఖ యావత్తు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మండిపడ్డ ఆయన.. 317 జీవోను సవరించాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమాలు చేస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ…