Hyderabad: అద్దె కార్లను చోరీ చేస్తున్న ముఠా గుట్టురట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో కార్లను అద్దెకు తీసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా గుట్టును రాచకొండ పోలీసులు ఛేదించారు. అక్టోబర్ నెలలో అద్దె కారు చోరీకి గురైందని చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని.. జూమ్ కార్స్ ద్వారా కారును అద్దెకు తీసుకుని మళ్లీ తిరిగి ఇవ్వకపోవడంతో యజమాని ఫిర్యాదు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేశామని.. ఈ విచారణలో నిందితులు అద్దె కార్లతో పాటు బైకులను కూడా చోరీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల నుంచి ఐదు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో కీలక నిందితుడు గుడ్డటి మహేష్ నూతన్ కుమార్ ఏపీకి చెందినవాడు అని వెల్లడించారు. తెలంగాణతో పాటు ముంబై, భువనేశ్వర్, చెన్నై, పూణెలలో నిందితులు అద్దెకు తీసుకున్న కార్లను గుర్తించామని తెలిపారు.
నూతన్ కుమార్ 2016లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడని.. ఆ తర్వాత మొబైల్ దొంగతనం కేసులో మలక్‌పేట్‌లో అరెస్ట్ అయ్యాడని వెల్లడించారు. నకిలీ గుర్తింపు కార్డులను ఇచ్చి కార్లను తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాల్లో అమ్మేవాడన్నారు. ప్రధాన నిందితుడు నూతన్ కుమార్‌పై మొత్తం 22 కేసులు ఉన్నాయన్నారు. అతడితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు. కార్లకు ఉండే జీపీఎస్ సిస్టమ్‌ను తొలగించి నిందితులు చోరీలకు పాల్పడేవారని పోలీసులు పేర్కొన్నారు. గతంలో అనేక పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసుల్లో నూతన్ కుమార్ అరెస్ట్ అయ్యాడని.. జైలు నుండి బయటకు రాగానే మళ్ళీ ఇదే దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. దొంగతనం చేసిన వాహనాలను మార్కెట్‌లో వివిధ ధరలకు అమ్ముతున్నాడని చెప్పారు. కార్లను అద్దెకు ఇచ్చే వారు మరింత టెక్నాలజీని పెంపొందించుకోవాలని రాచకొండ పోలీసులు సూచించారు.
Also Read
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!