భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్న ఆయన.. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొంటారు.. ఈ పర్యటన కోసం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ఇక్రిశాట్‌కు చేరుకోనున్న ప్రధాని మోడీ.. ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలను ప్రారంభిస్తారు.. ఇక, ఇక్రిశాట్లో కొత్తగా ఏర్పాటు చేసిన పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రంతో పాటు ర్యాపిడ్ జనరేషన్…
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్స్ పై నిషేధం విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ తెలిపారు.. రామచంద్రపురం ఇక్రిశాట్, ముంచింతల్ చిన్న జీయర్ ఆశ్రమం వద్ద డ్రోన్స్ పై నిషేధం ఉంటుందని.. రేపు ఉదయం 6 గంటల నుండి ఈ నెల 15వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేశారు.. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, పర గ్లిడర్స్, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్ పై నిషేధం విధించారు.. 15వ తేదీ వరకు వీవీఐపీల రాక సందర్భంగా…
దోశల్లో ఎన్నో రకాలు ఉంటాయి. అందులో కొన్ని చాలా టేస్టీగా ఉంటే, మరికొన్ని పబ్లిసిటీతో ఆకట్టుకుంటుంటాయి. అలాంటి వాటిల్లో ఢిల్లీలో 10 అడుగుల దోశ ఒకటి. అక్కడ ఈ దోశకు మంచి డిమాండ్ కూడా ఉన్నది. వీకెండ్స్‌లో ఫ్యామీలీలో ఈ దోశను తినేందుకు ఎక్కువగా ఢిల్లీలోని రెస్టారెంట్ కు వెళ్తుంటారు. సింగిల్‌గా 10 అడుగుల దోశను తిన్నవారికి 71 వేల రూపాయల ప్రైజ్ మనీగా ఇస్తామని ఇటీవలే రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీలో…
తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. అయితే, గత బులెటిన్‌తో పోలిస్తే మాత్రం.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గగా.. తెలంగాణలో మాత్రం స్వల్పంగా పెరిగాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కోవిడ్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 30,886 శాంపిల్స్ పరీక్షించగా 4,198 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో ఐదుగురు మృతి చెందారు, ఇదే సమయం 9,317 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. ప్రస్తుతం రాష్ట్రంలో…
శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు 2వ రోజుకి చేరుకున్నాయి. సేవకాలంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువు ప్రారంభం. ముందుగా అగ్ని ఆవాహన కార్యక్రమం…శమి, రావి కర్రలతో అగ్ని మధనం.1035 కుండాలతో శ్రీ లక్ష్మీ నారాయణ యాగం. యాగ మహా క్రతువులో పాల్గొననున్న 5 వేల మంది ఋత్విక్కులు. ప్రవచన శాలలో వేద పండితులచే ప్రవచన పారాయణం వుంటుంది.
కేంద్ర బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. గతేడాది లాగే ఈ సారి కూడా కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు మొండిచేయి చూపించిందని ఫైర్ అయ్యారు.. ఇక, రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు తెలంగాణకు నిధులు తీసుకురావడంలో విఫలం అయ్యారని ఆరోపించారు.. కేంద్ర బడ్జెట్ అంకెల గారడీ తప్ప అందులో ఏం లేదని దుయ్యబట్టిన ఆమె.. ఈ బడ్జెట్లో కూడా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించలేదన్నారు.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావనే…