విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రానున్న కాలానికి అనుగుణంగా అనురాగ్ సెట్, అగ్రి సెట్ పేర్లతో ఎంట్రన్స్ పరీక్షలను అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి అనురాగ్ సెట్ ప్రవేశ పరీక్ష ఏర్పాటు చేయగా.. అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి అగ్రి సెట్‌ను ఏర్పాటు చేశారు. అనురాగ్ సెట్, అగ్రి సెట్ పరీక్షలకు సంబంధించి తేదీని ఖరారు చేశారు. ఆయా పరీక్షలకు ఆన్‌లైన్ దరఖాస్తులను మార్చి 3 వరకు సమర్పించవచ్చని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. మార్చి 4 నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఛాన్సిలర్ యూ.బి దేశాయ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనురాగ్ యూనివర్సిటీ సీఈవో నీలిమ, అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం అధ్యాపకులు పాల్గొన్నారు.