హైదరాబాద్ లో సంచలనం కలిగిస్తున్న డ్రగ్స్ ముఠాను పట్టుకుంది నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్. ఇటీవలే నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ ఆధ్వర్యంలో మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసింది ఎన్ఎస్‌డబ్ల్యూ.
రాజస్తాన్‌కు చెందిన సురేష్ ను జీడిమెట్ల లో అదుపులోకి తీసుకుంది ఎన్ఎస్‌డబ్ల్యూ టీమ్. అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ గా సురేష్ ను గుర్తించింది ఎన్ఎస్‌డబ్ల్యూ. డ్రగ్ పెడ్లర్ తో పాటు నలుగురు వినియోగదారులను అరెస్టు చేసింది వింగ్. శాలిబండ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేసింది నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్. ఈ సందర్భంగా మూడు లక్షల రూపాయల విలువైన 75 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీ కోసం డ్రగ్స్ విక్రయించాలనుకున్నాడు సురేష్.
రాజస్తాన్ కు చెందిన జయంతిలాల్ మంజు వద్ద తక్కువ ధరకు హెరాయిన్ ను కొనుగోలు చేసిన సురేష్ హైదరాబాద్, సైబరాబాద్,రాచకొండ కమిషనరేట్ల పరిధుల్లో వినియోగదారులకు అధిక ధరకు విక్రయిస్తున్న విచారణలో తేలింది.