డ్రగ్స్ కేసులో కీలక మలుపు తిరిగింది.. ఇప్పటికే కీలక విషయాలు బహిర్గతం అయ్యాయి.. స్టార్ బాయ్ ఎక్కడివాడు కోణంలో దర్యాప్తు సాగుతోంది.. హైదరాబాద్‌లో స్టార్ బాయ్ మకాం వేసినట్లు.. ముంబై, హైదరాబాద్‌లో వ్యాపారవేత్తలకు డ్రగ్స్ విక్రయించినట్టు పోలీసులు గుర్తించారు.. స్టార్ బాయ్ నుంచే వ్యాపారవేత్తల కాంటాక్ట్‌లు టోనీ తీసుకున్నట్టుగా తేల్చారు.. అండర్ గ్రౌండ్లో ఉండి స్టార్ బాయ్ దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు కూడా గుర్తించారు.. 8 ఏళ్ల నుంచి డ్రగ్స్ విక్రయిస్తున్నటుగా కూడా పోలీసులు వెలికి…
హైదరాబాద్ నగరంలో రోడ్లపై నానాటికీ ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోతోంది. ఐటీ కార్యాలయాలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలులో ఉన్నా రోడ్లపై ట్రాఫిక్ మాత్రం తగ్గడం లేదు. దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని ట్రాఫిక్ జంక్షన్ల వద్ద భారీ మార్పులు చేయాలని నిర్ణయించారు. పలు జంక్షన్ల వద్ద రాకపోకలపై త్వరలో ఆంక్షలు విధించనున్నారు. రద్దీ జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌ను పెట్టేందుకు యోచిస్తున్నారు. Read Also: స్వల్పంగా పెరిగిన హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు నగరంలోని…
హైదరాబాద్ నగరం శివారులోని ముచ్చింతల్‌లో రామానుజచార్యుల సహస్రాబ్ది వేడుకల నేపథ్యంలో తపాలా శాఖ ప్రత్యేకంగా పోస్టల్ కవర్‌ను రూపొందించింది. ఈ మేరకు తపాలా శాఖ ముద్రించిన పోస్టల్ కవర్‌ను చినజీయర్ స్వామి, మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం సమతా మూర్తి విగ్రహం ఎదుట తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2,500 మంది కళాకారులు ప్రత్యేక ప్రదర్శన చేపట్టారు. మరోవైపు బుధవారం సాయంత్రం 5 గంటలకు సమతామూర్తి సహస్రాబ్ది వేడుకలకు అంకురార్పణ జరిగింది.…
హైదరాబాద్ శివారున వున్న ముచ్చింతల్‌కు సమీపంలోని శ్రీరామనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. శ్రీ రామానుజాచార్యులు భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా…. 216 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇవాళ్టి నుంచి 14 వరకు జరిగే… వివిధ కార్యక్రమాలకు… శ్రీరామ నగరాన్ని ముస్తాబు చేశారు. ఇప్పటికే సమతామూర్తి విగ్రహం ఎప్పుడు ఆవిష్కారం అవుతుందా అని భక్తులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు.…
వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళా శోభితమైన కళ్లు చెదిరే నిర్మాణాలు, పచ్చల కాంతులతో పుడమి నవ్వుతున్నట్లు ఎటు చూసినా మొక్కలతో హాయిగొలిపే పచ్చదనం.. వందకు పైగా ఆలయాల గోపురాలపై దేవతా మూర్తులతో ఆధ్యాత్మిక సుగంధాల మధ్య 216 అడుగుల భారీ లోహ విగ్రహంగా ఆయన వెలిశారు. ఇక, శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల కోసం ముచ్చింతల్…
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మళ్లీ ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు సిద్ధం అయ్యింది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే అన్ని స్కూళ్లను సిద్ధం చేశారు.. ఆన్లైన్ తరగతుల్లో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది సర్కార్.. అయితే, రేపటి నుంచి కూడా ఆన్లైన్ తరగతులే కొనసాగుతాయింటూ ఉస్మానియా యూనివర్సిటీ సహా మరికొన్నియూనివర్సిటీలు నిర్ణయం తీసుకున్నాయి.. కాగా, ఆన్ లైన్ తరగతులపై యూనివర్సిటీల నిర్ణయంపై తెలంగాణ విద్యా శాఖ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాలకు…
హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌లో పబ్బు యాజమానులతో ఆయన సమావేశం అయి డ్రగ్స్, మత్తు పదార్థాలను నిరోధించడానికి వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. ఏడేళ్లుగా నగరంలో ఒక్కసారి కూడా కర్ఫ్యూ విధించలేదన్నారు. ఎలాంటి ఆంక్షలు విధించలేదని తెలిపారు. హైదరాబాద్ అంటేనే భరోసా అని చెప్పారు. ఒడిశా ఏపీలలో గంజాయి సాగు ఎక్కువగా చేస్తున్నారు. అక్కడి నుండి గంజాయి కొని…
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ డ్రిల్మెక్ ఏర్పాటు కానుంది. ఇవాళ ఇటలీకి చెందిన డ్రిల్ మెక్- తెలంగాణ ప్రభుత్వం మధ్య MoU జరగనుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన ఏడున్నర ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదన్నారు. కనీసం ఈసారైన కేంద్ర బడ్జెట్లో అయినా రాష్ట్ర…
శంషాబాద్ లో నూతన పోలీస్ స్టేషన్ ప్రారంభం అయింది. మై హోం సహకారంతో పోలీస్ స్టేషన్ రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమానికి త్రిదండి చినజీయర్ స్వామి, హోం మంత్రి మహమూద్ అలీ, మై హోం గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు హాజరయ్యారు. ఏడాది కాలంలోనే ఈ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణం పూర్తిచేశారు. అత్యాధునిక సౌకర్యాలతో స్టేషన్ రూపుదిద్దుకుంది. , ఎంపీ రంజిత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు పి మహేందర్ రెడ్డి, సురభి వాణీదేవి,…