తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోయిన తెలుగు రాష్ట్రాలను మళ్లీ కలిపే కుట్ర జరుగుతోందని.. తెలుగు రాష్ట్రాలను ఉమ్మడి రాష్ట్రంగా చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు.. గుజరాత్ కంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే ఓర్వలేక పోతున్నారంటూ.. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించిన తలసాని.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాల్సిందేనని…
వర్షకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో నాలాలు ప్రమాద ఘంటికలు మోగిస్తుంటాయి. వచ్చే వర్షాకాలం నాటికి నాలాల పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్. నగరంలో ఎన్ని ముందస్తు జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతున్నాయని, నాలాలకు ఫెన్సింగ్, రక్షణ గోడ వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. Read Also షాకింగ్: ఐఫోన్ కోసం ఆర్డర్ చేస్తే… నాలా ప్రమాదాలు జరిగితే ఇకపై అధికారులనే బాధ్యులను చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ…
ఈరోజుల్లో అడుగడుగునా మోసాలు జరుగుతున్నాయి. ఆటోలలో ప్రయాణించే ప్రయాణికుల సెల్ ఫోన్లు, బ్యాగ్ లు మిస్ అవుతున్నాయి. ఆటో డ్రైవర్లలో కొందరు తమ నిజాయితీని చాటుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ ఆటోడ్రైవర్ నిజాయితీకి ప్రయాణికురాలు అభినందనలు తెలిపారు. నిజాయితీ గల ఆటో డ్రైవర్ సయ్యద్ జాకర్ తనకు లభించిన 10 తులాల బంగారాన్ని పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు. లంగర్ హౌస్ కి చెందిన మీర్జా సుల్తాన్ బేగ్ హషమ్నగర్ నుండి టోలీచౌకి వైపు హోండా…
క్రమంగా కరోనా కేసులు దిగివస్తున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ.. రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేవు అని ప్రకటించింది.. ఇవాళ మీడియాతో మాట్లాడిన రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాసరావు… కోవిడ్ మూడో వేవ్ తెలంగాణలో ముగిసిపోయిందన్నారు.. థర్డ్ వేవ్ జనవరి 28న పీక్ చూశామన్న ఆయన.. ఆ తరవాత తగ్గుతూ వచ్చిందన్నారు.. పాజిటివిటీ రేట్ తగ్గింది… తెలంగాణలో 2 శాతం లోపే పాజిటివిటీ రేటు ఉందన్నారు.. ఇక,…
అయితే అతివృష్టి… లేదంటే అనావృష్టి… ఇదీ టమాటా రైతుల పరిస్థితి. ఒక్కోసారి ఊహించనంత రేటు పలుకుతుంది. లేదంటే పాతాళానికి పడిపోతుంది. ప్రస్తుతం ఇదే జరగడంతో రైతు మళ్లీ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. టమాటా పేరు చెబితే గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్. కరోనా తర్వాత ఈమధ్యే కాస్త రైతు కోలుకున్నాడు. లావాదేవీలు కూడా ఆశాజనకంగా సాగాయి. కానీ కొద్దికాలంలోనే రేటు మళ్లీ కిందికి పడిపోయింది. చిత్తూరు జిల్లాలో ఈసారి పంట దిగుబడి ఊహించని స్థాయిలో…
తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి పునఃనిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో యాదాద్రి పర్యటించిన ఆయన.. పలు కీలక మార్పులు, చేర్పులు సూచిస్తూ వచ్చారు. అయితే, రేపు మరోసారి యాదగిరి గుట్ట పర్యటనకు వెళ్లనున్నారు. ముగింపు దశలో ఉన్న యాదాద్రి నిర్మాణ పనులను పరిశీలించనున్న సీఎం.. ఆలయ పునఃసంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శనయాగం, ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు.. కాగా, మార్చి 22 నుంచి మార్చి 28 వ తేదీ…
హైదరాబాద్ ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో రామానుజ సహస్రాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల రామానుజ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా తిరునామం పెట్టుకుని పట్టువస్త్రాలను నరేంద్ర మోదీ కట్టుకున్నారు. సంప్రదాయ వస్త్రాలలో యాగశాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమతా మూర్తి విగ్రహం బరువు 1800 కిలోలు కాగా.. గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న రెండో…
హైదరాబాద్లో జరుగుతున్న ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల లోగోను, స్టాంప్ను మోదీ ఆవిష్కరించారు. అనంతరం పలు స్టాళ్లను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ… వసంత పంచమి రోజున స్వర్ణోత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. గత 50 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఇక్రిశాట్ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలని…