కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతున్నాయి.. క్రమంగా సీఎంను బర్తరఫ్ చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.. ఈ అంశంపై స్పందించిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు దేశ సంస్కృతిపై గౌవరం ఉంటే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు భట్టి……
హైదరాబాద్ లో సంచలనం కలిగిస్తున్న డ్రగ్స్ ముఠాను పట్టుకుంది నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్. ఇటీవలే నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఆధ్వర్యంలో మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసింది ఎన్ఎస్డబ్ల్యూ. రాజస్తాన్‌కు చెందిన సురేష్ ను జీడిమెట్ల లో అదుపులోకి తీసుకుంది ఎన్ఎస్డబ్ల్యూ టీమ్. అంతర్ రాష్ట్ర డ్రగ్ పెడ్లర్ గా సురేష్ ను గుర్తించింది ఎన్ఎస్డబ్ల్యూ. డ్రగ్ పెడ్లర్ తో…
హైదరాబాద్ శంషాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శించిన రాందేవ్ బాబా.. చినజీయర్ స్వామిపై ప్రశంసలు కురిపించారు. రామానుజాచార్యుల విగ్రహం ఏర్పాటు చేసిన చినజీయర్‌స్వామి చరిత్రలో నిలిచిపోతారని యోగా గురు రాందేవ్ బాబా అన్నారు. భారత వాస్తు, సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలనుకునేవారు కచ్చితంగా రామానుజాచార్యుల దివ్యక్షేత్రాన్ని సందర్శించాలని సూచించారు. తాను వీలైనన్నిసార్లు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటానని రాందేవ్ బాబా చెప్పారు. అటు భారతీయ సంస్కృతిలో అసమానత, అన్యాయం ఉందని కొందరు పదేపదే వాదిస్తుంటారని.. సనాతన ధర్మంపై…
హైదరాబాద్ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్‌లో సెటిల్ అవుతుంటారు. ఇక్కడ ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. ప్రేమకు చిహ్నాలుగా కట్టిన కట్టడాలు ఉన్నాయి. అలాంటి కట్టడాల్లో ఒకటి పురానాపూల్ బ్రిడ్జి. ఈ వంతెన ప్రేమకు చిహ్నంగా నిర్మించారు. కులీకుతుబ్ షా, భాగమతి ప్రేమకు గుర్తుగా ఈ మూసీ నదిపై వంతెనను నిర్మించారు. గోల్కొండ కోటలో ఉండే కులీకుతబ్ షా, మూసీ నదికి ఇవతల ఉండే భాగమతి ప్రేమలో పడిన తరువాత మూసీని దాటేందుకు…
విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రానున్న కాలానికి అనుగుణంగా అనురాగ్ సెట్, అగ్రి సెట్ పేర్లతో ఎంట్రన్స్ పరీక్షలను అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యం ప్రవేశపెట్టింది. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి అనురాగ్ సెట్ ప్రవేశ పరీక్ష ఏర్పాటు చేయగా.. అగ్రికల్చర్ విభాగానికి సంబంధించి అగ్రి సెట్‌ను ఏర్పాటు చేశారు. అనురాగ్ సెట్, అగ్రి సెట్ పరీక్షలకు సంబంధించి తేదీని ఖరారు చేశారు. ఆయా పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తులను మార్చి 3 వరకు సమర్పించవచ్చని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. మార్చి…
హైదరాబాద్ నగరంలో కార్లను అద్దెకు తీసుకుని చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును రాచకొండ పోలీసులు ఛేదించారు. అక్టోబర్ నెలలో అద్దె కారు చోరీకి గురైందని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని.. జూమ్ కార్స్ ద్వారా కారును అద్దెకు తీసుకుని మళ్లీ తిరిగి ఇవ్వకపోవడంతో యజమాని ఫిర్యాదు చేసినట్లు రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేశామని.. ఈ విచారణలో నిందితులు అద్దె కార్లతో…
ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స కుమారుడి వివాహం హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ మేరకు సీఎం జగన్ దంపతులు వరుడు డాక్టర్ లక్ష్మీనారాయణ్ సందీప్, వధువు పూజితలను ఆశీర్వదించారు. అటు ఈ వివాహానికి టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ కూడా వచ్చారు. ఆయనను మంత్రి బొత్స కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు ఈ వివాహానికి మెగాస్టార్ చిరంజీవితో…
కరోనా కారణంగా వాయిదా పడ్డ నుమాయిష్‌ను ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి నెలాఖరు వరకు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్ కొనసాగనుంది. ఇందుకోసం అన్ని శాఖల నుంచి అనుమతులు మంజూరైనట్లు తెలుస్తోంది. ఈమేరకు స్టాళ్ల నిర్వాహకులకు ఆహ్వానాలు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకవేళ స్టాళ్ల నిర్వాహకులు సిద్ధంగా లేకపోతే ఫిబ్రవరి 25 నుంచి నుమాయిష్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. అన్ని శాఖల నుంచి అనుమతులపై రెండురోజుల్లో…
రాష్ట్ర విభజనపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ప్రధాని నరేంద్ర మోడీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. ప్రధావి మోడీవి పనికిమాలిన కూతలుగా పేర్కొన్న ఆయన.. దేశానికి ప్రధానిగా ఇలా మాట్లాడతారా ? అని నిలదీశారు… తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మోడీ ఎనిమిదేళ్ళ క్రితం అన్నారని గుర్తుచేసిన కేటీఆర్.. ఇప్పుడు మళ్లీ అసందర్భంగా మాట్లాడారని దుయ్యబట్టారు.. ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాల్సిందేన్నారు.. ఇక, విగ్రహావిష్కరణ కోసం…
ఈ దేశంలో రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలు ఎక్కువ శాతం నడుపుతోంది హిందువులే… హిందువుల ముందు నిలబడే సామర్థ్యం ఎవరికి లేదని వ్యాఖ్యానించారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్… హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో రామానుజాచార్య మిలీనియం వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనం సనాత ధర్మంలో అన్ని ఉన్నాయి. దేశంలో ఆలయాల నిర్మాణం జరుగుతోంది. మనం ఎవరో మనం మరిచిపోయాం అంతే.. ఇప్పుడు ప్రతి హిందువు ఇదే మరిచిపోయాడు. తనలోని బలం ఏంటో తనకు తెలియదు.…