సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి కృష్ణమోహన్ కూతురు పెళ్లి వైభవంగా జరిగింది… సందీప్-సబీన దంపతుల కుమారుడు శుభంతో ఆలపాటి వెంకటేశ్వరరావు మనవరాలు, ఆలపాటి కృష్ణమోహన్-మాధవి గారాల పట్టి దివ్య వివాహాన్ని ఈ రోజు రాత్రి ఢిల్లీ ఎరో సిటీలోని ఓ హోటల్‌లో సందడిగా నిర్వహించారు.. పలువురు వివిధ రంగాలు చెందిన ప్రముఖులు హాజరై దివ్య-శుభం దంపతులను ఆశీర్వదించారు..
ఇక, దిగువన ఉన్న ఫొటోలో.. ఆలపాటి కృష్ణమోహన్ కుమారుడు ఆదిత్య, ఆలపాటి కృష్ణ మోహన్, శుభం (పెళ్లి కుమారుడు), దివ్య (పెద్ద కూతురు), మాధవి (భార్య), సౌమ్య (చిన్న కూతురు) ఉన్నారు.
కాగా, పర్యాటన రంగంలో సదరన్ ట్రావెల్స్ ప్రత్యేకంగా గుర్తింపు పొందింది… జాతీయ పర్యాటక అవార్డుల్లో వరుసగా అవార్డులను అందుకుంది అంటే.. సదరన్ ట్రావెల్స్.. తమ ప్రయాణికులకు ఎలాంటి ఉత్తమ సేవలు అందిస్తుందో అర్థం చేసుకోవచ్చు.. సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి కృష్ణమోహన్, జేఎండీ ఆలపాటి ప్రవీణ్‌కుమార్‌లు రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే.