రైతు బీమా పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు బీమా వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది రైతులు ఉంటే.. కేవలం 32 లక్షల మందికి మాత్రమే బీమా చేశారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మిగిలిన 34 లక్షల మంది రైతులకు భీమా వర్తించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టుకు విన్నవించారు… అయితే, దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది… 6 వారాల్లో తమకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది… కాగా, రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క గుంట భూమి ఉన్నా సరే.. ఆ రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.. రైతు బంధుతో పాటు.. రైతు బీమా కల్పిస్తోంది సర్కార్.
Read Also: High Court: ప్రభుత్వ భూముల విక్రయానికి గ్రీన్ సిగ్నల్