అయితే అతివృష్టి… లేదంటే అనావృష్టి… ఇదీ టమాటా రైతుల పరిస్థితి. ఒక్కోసారి ఊహించనంత రేటు పలుకుతుంది. లేదంటే పాతాళానికి పడిపోతుంది. ప్రస్తుతం ఇదే జరగడంతో రైతు మళ్లీ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. టమాటా పేరు చెబితే గుర్తుకు వచ్చేది చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్. కరోనా తర్వాత ఈమధ్యే కాస్త రైతు కోలుకున్నాడు. లావాదేవీలు కూడా ఆశాజనకంగా సాగాయి. కానీ కొద్దికాలంలోనే రేటు మళ్లీ కిందికి పడిపోయింది. చిత్తూరు జిల్లాలో ఈసారి పంట దిగుబడి ఊహించని స్థాయిలో…
తెలంగాణ సీఎం కేసీఆర్ యాదాద్రి పునఃనిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో యాదాద్రి పర్యటించిన ఆయన.. పలు కీలక మార్పులు, చేర్పులు సూచిస్తూ వచ్చారు. అయితే, రేపు మరోసారి యాదగిరి గుట్ట పర్యటనకు వెళ్లనున్నారు. ముగింపు దశలో ఉన్న యాదాద్రి నిర్మాణ పనులను పరిశీలించనున్న సీఎం.. ఆలయ పునఃసంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శనయాగం, ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు.. కాగా, మార్చి 22 నుంచి మార్చి 28 వ తేదీ…
హైదరాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో రామానుజ సహస్రాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల రామానుజ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా తిరునామం పెట్టుకుని పట్టువస్త్రాలను నరేంద్ర మోదీ కట్టుకున్నారు. సంప్రదాయ వస్త్రాలలో యాగశాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమతా మూర్తి విగ్రహం బరువు 1800 కిలోలు కాగా.. గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న రెండో…
హైదరాబాద్‌లో జరుగుతున్న ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల లోగోను, స్టాంప్‌ను మోదీ ఆవిష్కరించారు. అనంతరం పలు స్టాళ్లను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ… వసంత పంచమి రోజున స్వర్ణోత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. గత 50 ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఇక్రిశాట్ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలని…
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు.. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది.. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొననున్న ఆయన.. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొంటారు.. ఈ పర్యటన కోసం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ఇక్రిశాట్‌కు చేరుకోనున్న ప్రధాని మోడీ.. ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలను ప్రారంభిస్తారు.. ఇక, ఇక్రిశాట్లో కొత్తగా ఏర్పాటు చేసిన పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రంతో పాటు ర్యాపిడ్ జనరేషన్…
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రోన్స్ పై నిషేధం విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ తెలిపారు.. రామచంద్రపురం ఇక్రిశాట్, ముంచింతల్ చిన్న జీయర్ ఆశ్రమం వద్ద డ్రోన్స్ పై నిషేధం ఉంటుందని.. రేపు ఉదయం 6 గంటల నుండి ఈ నెల 15వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని ఉత్తర్వులు జారీ చేశారు.. రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, పర గ్లిడర్స్, మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్స్ పై నిషేధం విధించారు.. 15వ తేదీ వరకు వీవీఐపీల రాక సందర్భంగా…
దోశల్లో ఎన్నో రకాలు ఉంటాయి. అందులో కొన్ని చాలా టేస్టీగా ఉంటే, మరికొన్ని పబ్లిసిటీతో ఆకట్టుకుంటుంటాయి. అలాంటి వాటిల్లో ఢిల్లీలో 10 అడుగుల దోశ ఒకటి. అక్కడ ఈ దోశకు మంచి డిమాండ్ కూడా ఉన్నది. వీకెండ్స్‌లో ఫ్యామీలీలో ఈ దోశను తినేందుకు ఎక్కువగా ఢిల్లీలోని రెస్టారెంట్ కు వెళ్తుంటారు. సింగిల్‌గా 10 అడుగుల దోశను తిన్నవారికి 71 వేల రూపాయల ప్రైజ్ మనీగా ఇస్తామని ఇటీవలే రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఢిల్లీలో…