తెలంగాణలో జేఎన్టీయూ పరిధిలో జరగాల్సిన పరీక్షలపై సందిగ్ధత నెలకొంది… షెడ్యూల్ ప్రకారం ఎల్లుండి (సోమవారం) నుండి జేఎన్టీయూ ఇంజినీరింగ్ పరీక్షలు జరగాల్సి ఉంది.. అయితే, ఇప్పటి వరకు విద్యార్థులకు హాల్ టికెట్స్ అందకపోవడం పెద్ద చర్చగా మారింది.. మరోవైపు, పరీక్షలు నిర్వహిస్తే ఇవ్వాల్సిన ఆన్సర్ షీట్స్ కూడా ఇప్పటి వరకు కాలేజీలకు చేరకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ఆయా కాలేజీల యాజమాన్యాలు. అయితే, దీనికి ఫీజుల వ్యవహారమే అడ్డుగా మారినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే, కాలేజీలు కామన్ సర్వీస్ ఫీ చెల్లిస్తేనే హాల్ టికెట్స్, ఆన్సర్ సీట్స్ పంపిస్తామని జేఎన్టీయూ స్పష్టం చేసినట్టుగా సమాచారం. ఈమేరకు ప్రైవేట్ కాలేజీలకు యూనివర్సిటీ నుంచి మెసేజ్‌లు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే, మాకు ఫీరియింబర్స్‌మెంట్ ఇంకా రాలేదని.. వచ్చే ఏడాది ఆఫలియేటెడ్ ఫీతో పాటు కామన్ సర్వీస్ ఫీ కూడా కలిపి చెల్లిస్తామని కాలేజీ యాజమాన్యాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో.. అసలు పరీక్షలు ఉంటాయా? లేదా? అనే సందిగ్ధత నెలకొనడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: AP Capital: ఒకటికి 10 సార్లు చెబుతున్నాం.. 3 రాజధానులకే కట్టుబడి ఉన్నాం..