హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజాలో జెండర్ ఫర్ ఈక్వాలిటీ రన్ నిర్వహించారు. ఈ రన్ లో వందలాది మంది యువతులు పాల్గొన్నారు. ముఖ్య అతిధిగా హాజరయ్యారు నగర సీపీ సీవీఆనంద్, హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్. పాల్గొన్న పలువురు ఐపీఎస్ లు.
సిటీలో 80 మంది మహిళాఎస్ఐలు పోలీసులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. మహిళ దినోత్సవం సందర్భంగా మొదటి మహిళా లా అండ్ ఆర్డర్ SHO ను నియమిస్తున్నాం అన్నారు నగర సీపీ సీవీ ఆనంద్. ఎన్ సి అర్ బి డేటా ప్రకారం మహిళలు నివసించేందుకు హైదరాబాద్ సేఫ్ ప్రాంతం అన్నారు. మహిళలకి అవకాశాలు కలిపిస్తే అద్భుతంగా పని చేస్తారు. మహిళల భద్రతపై సీఎం కేసీఆర్ చాలా దృష్టి పెట్టీ షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. మహిళ ఎస్ హెచ్ ఓ ను లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కు కేటాయించడం అనేది మంచి పరిణామం అన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
హోమ్ మంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు మూడు రోజులు చేశాం. మహిళ దినోత్సవంను మూడు రోజులు జరుపుతున్నాం. మహిళలు అన్ని విధాలుగా తమ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు మంత్రి మహమూద్ అలీ.