నేడు కడపలో బీజేపీ బహిరంగసభ, రాయలసీమ రణభేరి పేరుతో బీజేపీ సభ, హాజరుకానున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, పురంధేశ్వరి, ఇతర రాష్ట్ర నేతలు.నేడు మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు కీలక మ్యాచ్, ఆక్లాండ్ వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత మహిళల జట్టు.పంజాబ్‌లో ఇవాళ కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం.. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో కేబినెట్ ప్రమాణస్వీకారం.ఏపీ వ్యాప్తంగా నేడు, రేపు నిరసనలకు టీడీపీ పిలుపు, నాటుసారా నిషేధించాలంటూ టీడీపీ ఆందోళన.ఒంగోలు ఇవాళ్టి నుండి 29వ తేదీ వరకూ నాలుగు బ్యాచ్‌లుగా ఎంపీటీసీలకు విధులు - భాద్యతలపై శిక్షణా తరగతులు.అనంతపురం జిల్లా కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాల చంద్రప్రభ, సూర్యప్రభ వాహన సేవ.తూర్పుగోదావరి జిల్లా నేడు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ప్రత్యేక బడ్జెట్ సమావేశం. ఉదయం 11 గంటలకు కౌన్సిల్, మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్.నెల్లూరులోని పెన్నా నదిపై నిర్మిస్తున్న బ్యారేజ్ పనులను ఈ రోజు పరిశీలించనున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్.విశాఖ: ఋషికొండలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయంలో రెండో రోజు మహాసంప్రోక్షణ కార్యక్రమాలు. నేడు శ్రీవారి ఆలయం సందర్శించనున్న మంత్రి అవంతి శ్రీనివాస్.విజయనగరం: నేడు రామతీర్ధం రాస్వామి ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమం.అనంతపురం: హిందూపురంలో నేడు శ్రీ పేట వెంకటరమణ స్వామి దేవాలయంలో స్వామివారి ప్రాకార ఉత్సవం.అనంతపురం : చెన్నేకొత్తపల్లి మండలంలోని న్యామద్దల గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి జాతర.నేడు మంచు మోహన్ బాబు యూనివర్సిటీని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.నేటి నుంచి మూడు రోజులపాటు గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల నిదానంపాటి అమ్మవారి తిరునాళ్ల ఉత్సవాలు.జగిత్యాల జిల్లా: నేడు సాయంత్రం ధర్మపురి శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్ల తెప్పోత్సవం. డోలోత్సవం.