హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. మరో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. దోమలగూడ కేంద్రంగా ఇంటర్నెట్ ఫార్మసీ పేరుతో డ్రగ్ రాకెట్ నడుపుతున్నారు. హైదరాబాద్ నుండి అమెరికాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఆన్లైన్లో ఫార్మా మందులతోపాటు సప్లై చేస్తున్న కంపెనీ గుట్టుని పట్టేశారు పోలీసులు. జే ఆ ర్ ఇన్ఫినిటీ పేరుతో కంపెనీ నడిపిస్తున్న వైనం బయటపడింది.
పక్కా సమాచారంతో దాడి చేసిన ఎన్ సి బి అధికారులు షాకయ్యారు. 3.71 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈమెయిల్స్ , VOIP ద్వారా కస్టమర్ల నుండి ఆర్డర్లు తీసుకుంటోం ఈ కంపెనీ. హైదరాబాద్ నుండి విదేశాలకు భారీగా డ్రగ్స్ సప్లై అవుతున్నట్టు గుర్తించారు. గడిచిన రెండు సంవత్సరాల్లో వెయ్యికి పైగా డ్రగ్స్ ఆర్డర్లు అమెరికా కు పంపిందీ కంపెనీ. క్రెడిట్ కార్డు బిట్ కాయిన్ ద్వారా చెల్లింపులు జరుపుతున్నారు కష్టమర్లు. ఈ డ్రగ్స్ రాకెట్ కి చెందిన కింగ్ పిన్ ను అరెస్ట్ చేసింది ఎన్సీబీ. మరింత లోతుగా దర్యాప్తు చేసే పనిలో వున్నారు ఎన్సీబీ అధికారులు.
Balineni Srinivasreddy:పొత్తుల్లేకపోతే బాబుకి పొద్దు పొడవదు
సైబరాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. 800 కిలోల గంజాయిని పట్టుకున్నారు ఎస్వోటీ అధికారులు. యూపీకి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసిన ఎస్వోటీ పోలీసులు ఈ ముఠా వెనుక ఎవరున్నారనేది ఆరా తీస్తున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్ మీదుగా యూపీకి గంజాయి రవాణా అవుతోంది. యూపీతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్నారు. పత్తి విత్తనాల మాటున గంజాయి సరఫరా చేస్తున్న ముఠా ఇది. పరారీలో ఉన్న ముగ్గురు యూపీ వాసుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.