Rahul Gandhi: చంచల్ గూడ జైలుకు రాహుల్ గాంధీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాహుల్ గాంధీ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. అయితే రాహుల్ చంచల్ గూడ పర్యటనపై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. చంచల్ గూడ్ జైలులో ఉన్న ఎన్‌ఎస్‌యూ నేతలను పరామర్శించేందుకు రాహుల్ గాంధీకి అనుమతి లభించింది. రాహుల్ గాంధీతో పాటు మరోక్కరికి మాత్రమే ఎన్‌ఎస్‌యూఐ నేతలను పరామర్శించేందుకు జైళ్ల శాఖ అనుమతించింది. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీజీ జితేందర్ అధికారికంగా ధ్రువీకరించారు.
Read Also: Chandrababu: ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారు..
Also Read
హోటల్ తాజృష్ణాలో బస చేసిన ఆయనను, పార్టీ నాయకులతో పాటు.. గద్దర్ వంటి మరికొందరు ముఖ్యులు భేటీ అయ్యారు. అనంతరం దివంగత సీఎం సంజీవయ్యకు నివాళులర్పించిన ఆయన.. అక్కడినుంచి నేరుగా చంచల్ గూడ జైలులో దీక్ష చేస్తున్న NSUI నేతలతోనూ భేటీ కానున్నారు. అంతకుముందు హైడ్రామా నడుమ చంచల్ గూడ జైల్లో రాహుల్ గాంధీ ములాఖత్ కు పర్మిషన్ లభించింది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చంచల్గూడ వెళ్లనున్న రాహుల్ జైల్లో ఉన్న NSUI నేతలు, కార్యకర్తలను పరామర్శించనున్నారు. దీంతో జైలు దగ్గర అదనపు బలగాలను మోహరించి భద్రత పెంచారు పోలీసులు. రాహుల్, రేవంత్.. ఇద్దరికి మాత్రమే అనుమతి లభించింది. అయితే, చివరి నిమిషంలో ములాఖత్‌కు అనుమతివ్వడాన్ని తప్పుబట్టారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల. ఇప్పటికిప్పుడు అనుమతి అంటే ఎలా ప్లాన్ చేసుకుంటారని ప్రశ్నించారు.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణ ఉద్యమకారులతో రాహుల్ సమావేశం నిర్వహించారు. గద్దర్, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి నేతలు ఆయన్ను కలిసి ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించారు. ఇక, ఒంటి గంటా 50 నిమిషాలకు గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో సమావేశమై, పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్.. పార్టీ సభ్యత నమోదు కోఆర్డినేటర్లతో ఫొటో సెషన్ తర్వాత, సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?