Srinivas Goud: మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ జ్యోతి, చైతన్య దీప్తి అల్లూరి సీతారామరాజు 98వ వర్థంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉమ్మడి రాష్ట్రాల క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని అల్లూరికి ఘన నివాళులర్పించారు.
ఆనాటి స్వాతంత్ర సంగ్రామంలో అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినా పోరాటాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు జాతికి, తెలంగాణ ప్రాంతానికి చెందిన మహనీయుల సేవలను నేటి తరానికి అందించేందుకు వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించి వారి సేవలను గుర్తుచేస్తున్నామన్నారు.
Also Read
27 ఏళ్ళ వయస్సులో గిరిజనులు, నిరక్షరాస్యులను, పేదలను, కొద్దిమంది అనుచరులతో, పరిమిత వనరులతో బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన గొప్ప ఉద్యమ శక్తి అల్లూరి సీతారామరాజు అని అభివర్ణించారు. అల్లూరి సీతారామరాజు ఈతరానికి కూడా స్ఫూర్తి అన్నారు. ఆయన త్యాగదీక్ష, ఏకాగ్రత, ధైర్యం నేటి యువత అలవర్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు చరిత్రను, వారి త్యాగనిరతిని భవిష్యత్ తరాలకు అందించేలా అందరూ కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రమేష్ దాట్ల, మంతెన వెంకట రామరాజు, DSN రాజు, అల్లూరి సీతారామరాజు, VVR వర్మ, క్షత్రీయ సేవ సమితి అధ్యక్షుడు పెరిచెర్ల నాగరాజు, నడింపల్లి నానిరాజు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదాపూర్ సమీపంలోని ఖానామెట్ గ్రామ పరిధిలో 2 ఎకరాల 36 గుంటల భూమి పత్రాలను AP & TS Kshatriya Seva Samithi కి ప్రభుత్వం కేటాయించిన పత్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో జంటనగరాల్లో క్షత్రియ సోదరులు, సోదరీమణులు పాల్గొన్నారు.
Madhya Pradesh: వెంటపడి మరీ మహిళను చితకబాదిన లాయర్.. కారణమేంటంటే?
తాజావార్తలు
-
TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
-
Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!
-
IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ వచ్చినప్పుడు ఈ ఒక్క పని ప్రాణాలు కాపాడొచ్చు.. ఒక్క నిమిషం ఆలస్యమైనా..
-
NANI : డ్యామేజైన ఫ్యామిలీ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నేచురల్ స్టార్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!