Hyderabad : బంజారాహిల్స్‌లో దారుణం.. బీరు బాటిల్ తో కడుపులో పొడిచి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పదిరోజుల వ్యవధిలో హత్యలు జరగడం ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆస్తి కోసం ఒకచోట.. డబ్బులు తిరిగి ఇవ్వనందుకు మరోచోట.. ఇతరత్రా కారణాలతో ఇంకోచోట హత్యలు జరుతూనే వున్నాయి.
సరూర్‌నగర్ మున్సిపాలిటీ సమీపంలో పరువుహత్య మరవకముందే.. రాజధాని హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.12లో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నీలోఫర్ కేఫ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిల్‌తో కడుపులో పొడిచి వ్యక్తిని హత్య చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో గొడవ.. ఆపై హత్య చేసి పరారై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
పదుల సంఖ్యలో హత్యలు :
మే 4 2022 సంగారెడ్డి జిల్లాలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. రామచంద్రాపురంకు చెందిన ఆటో డ్రైవర్ వినయ్ దారుణ హత్యకు గురయ్యాడు. తెల్లాపూర్ రైల్వే కల్వర్ట్ వద్ద మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గత రెండు రోజుల క్రితం ఆటో చోరీ విషయంలో వినయ్‌ను ఇద్దరు ఆటో డ్రైవర్లు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ నెల 4వ తేదీన సరూర్‌నగర్ మున్సిపాలిటీకి సమీపంలో.. నాగరాజును అతని భార్య సోదరులే హత్య చేసిన ఘటన సంచలంగా మారింది. జనవరి 31న ఆశ్రీన్ సుల్తానా, నాగరాజులు ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఆశ్రీన్ సోదరులకు నచ్చలేదు. దీంతో నాగరాజున ఎప్పటికైనా చంపేయాలని ప్లాన్ చేశారు. ఓ కార్ల కంపెనీలో నాగరాజు సేల్స్ మేన్ గా పనిచేస్తున్నాడు. నాగరాజు కదలికలపై నిఘా ఏర్పాటు చేసిన ఆశ్రిన్ సోదరులు ఈ నెల 4వ తేదీన నాగరాజుపై దాడి చేసి హత్య చేశారు.నాగరాజును హత్య చేసిన ఆశ్రీన్ ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. సమస్యలేమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని, మరీ హత్య చేసే దాకా వెళ్లవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్‌ప్లే
-
Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
-
Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!