చోరీ కేసులో ఓ పోలీసు ఇన్స్పెక్టర్ చేతివాటం చూపించాడు. నిందితుని ఖాతానుంచి పైసల కాజేసాడు. ఈవార్త తెలంగాణలోనే సంచళనంగా మారింది. నిందితున్ని శిక్షించాల్సిన పోలీసులే నిందితుని ఖాతాలోంచి డబ్బులు గోల్ మాల్ చేయడం ఏంటని విమర్శలకు దారితీంది. ఈవిషయం కాస్త రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ వరకు చేరడంతో స్పందించిన ఆయన ఇన్స్పెక్టర్ దేవేందర్ ను సస్పెన్షన్ వేటు వేశారు.
అసలు ఏం జరిగింది ?
ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో అగర్వాల్ అనే వ్యక్తిని చోరీ కేసులో రాచకొండ కమీషనరేట్ కి చెందిన CCS పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ.. సమయంలో అగర్వాల్ దగ్గర నుంచి డెబిట్ కార్డును కూడా సీజ్ చేశారు పోలీసులు. అయితే.. కొద్దిరోజులు క్రితమే నిందితుడి బెయిల్ పై బయటకు వచ్చాడు. డెబిట్ కార్డునుంచి డబ్బులు విత్రా కావడంతో నిర్ఘాంతపోయాడు. ఏకంగా అగర్వాల్ ఖాతా నుంచి 5లక్షలు మాయం కావడంపై బ్యాంకులో ఆరాతీశాడు. ఏఏ ATM ల నుండి డబ్బులు డ్రా చేశారనే వివరాలను సేకరించాడు. సీజ్ చేసిన ఏటీఎం కార్డు నుంచి డబ్బులు ఎలా మాయమయ్యాయో అంటూ ఆలోచనలో పడ్డాడు అగర్వాల్. ఇక చేసేదేమి లేక ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో.. ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ అంతర్గత విచారణకు ఆదేశించారు. ఒక ఇన్స్పెక్టర్.. నిందితుడి ఏటీఎం కార్డ్ ద్వారా 5 లక్షలు డ్రా చేసినట్లు గుర్తించారు పోలీసులు. అతనిపై విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో ఇన్స్పెక్టర్ దేవేందర్ ను స్పస్పెండ్ చేశారు.
నేరం చేసేది ఎవరైనా సరే సహించేది లేదని, ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షిస్తామని మీడియాద్వారా వెల్లడించే పోలీసులు, ఇప్పుడు ఆమాటను నిలబెట్టుకున్నారు. పోలీసే నేరం చేయడంతో అతనిపై విచారణ జరిపించి , నేరం చేశాడనే రుజువుకావడంతో సస్పెండ్ చేశారు. దీంతో తెలంగాణ పోలీసు తీరుపై ప్రజలు సభాష్ పోలీస్ అంటూ ప్రసంసల జల్లు కురిపిస్తున్నారు.
Asani Cyclone: ఏపీకి అలెర్ట్.. తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్