Hyderabad:ఈ నెల 16 నుంచి సాలార్‌జంగ్ మ్యూజియంలోకి ఫ్రీ ఎంట్రీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 16వ తేదీ నుంచి 21 వరకు వారం రోజుల పాటు ఎలాంటి ప్రవేశం రుసుము లేకుండా సాలార్‌జంగ్ మ్యూజియంలోకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్‌రెడ్డి తెలిపారు.
ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం డేను పురస్కరించుకుని హైదరాబాద్, సాలార్‌జంగ్ మ్యూజియంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ రెడ్డి తెలిపారు. దీనికోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి 21 వరకు, వారం రోజులపాటు వేడుకలు జరుగుతాయన్నారు. మ్యూజియం డేకు సంబంధించిన వివరాలను నాగేందర్ రెడ్డి వెల్లడించారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వారం రోజుల్లో సందర్శకులు ఎవరైనా కెమెరాలతో ఉచితంగా సాలార్‌జంగ్ మ్యూజియం చూడొచ్చు. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు మ్యూజియం అందుబాటులో ఉంటుంది. ప్రైవేటు సంస్థలు కూడా పర్యాటకుల్ని ఉచితంగా తీసుకురావొచ్చు. రాత్రి వేళలో కూడా మ్యూజియం అందంగా కనిపించేలా అలంకరించనున్నారు. 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, 75 రకాల వస్తువులతో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు.
Also Read
పాఠశాల పిల్లలకు కళలు, చేతిపనులు, డ్రాయింగ్ మొదలైన వాటిపై శిక్షణ ఇస్తారు. బిద్రి తయారీపై ఒక రోజు వర్క్‌షాప్ / ప్రదర్శన, ఉపన్యాసం ఉంటుంది. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి చెందిన 75 మంది కళాకారులచే ప్రత్యేక ఆర్ట్ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. భాగ్యనగర్ ఫోటో ఆర్ట్ క్లబ్‌తో కలిసి మ్యూజియం వస్తువులపై ఫోటోగ్రఫీలో పోటి ఉంటుంది. దీనిలో గెలిచిన వాళ్లకు నగదు బహుమతి కూడా అందిస్తారు. యూరోపియన్ ఆర్ట్‌లో హాస్యం”పై ప్రత్యేక ఉపన్యాసంతోపాటు, ‘‘ప్రివెంటివ్ కన్జర్వేషన్’’పై వెబ్‌నార్ కూడా ఉంటుంది. ఐ లవ్ ‘ఎస్‌జేఎమ్’ పేరుతో రెండు ప్రదేశాల్లో ఫోటో పాయింట్/సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగులు, అనాథ విద్యార్థుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జానపద కళాకారులచే కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.
తాజావార్తలు
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!