తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఖమ్మం బీజేపీ నేత సాయి గణేష్ ఆత్మహత్య వ్యవహారం హైకోర్టుకు చేరింది… పోలీసుల వేధింపులు తాళలేకే సాయి గణేష్ ఆత్మహత్య చేస్తున్నాడంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఈ ఆత్మహత్యపై సీబీఐతో విచారణ జరిపించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు పిటిషనర్ తరపు న్యాయవాది అభినవ్.. ఇక, ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు మొత్తం 8 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.. ఇక,…
హైదరాబాద్ లో సంచలనం కలిగించిన మల్కాజిగిరి లేడీ మర్డర్ కేసులో ట్విస్ట్ బయటపడింది. నగలకోసం మహిళ హత్య జరిగిందని తెలుస్తోంది. భక్తురాలిని హత్య చేసిన పూజారి అని తేలడంతో అందరూ విస్మయానికి గురయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మల్కాజిగిరి పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు పూజారి మురళిని పట్టుకున్నారు మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు. మల్కాజిగిరి ఉమాదేవి అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈనెల 18న వినాయక టెంపుల్ కి వెళ్ళిన…
భారత ప్రభుత్వం ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ఆరోగ్య మేళాలను నిర్వహిస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దేశమంతా మండలి స్థాయిలో ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకోకుండా ప్రజలు ప్రయివేటు ఆసుపత్రికి వెళుతున్నారు. ధనిక, పేద అనే తేడా లేకుండా కేంద్ర ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇస్తుందన్నారు. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ లో హెల్త్ మేళాను ప్రారంభించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ హాజరయ్యారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్…
రాజకీయ నాయకులు, అధికారుల మధ్య అనైతిక సంబంధాల వ్యవహారంలో హాట్ కామెంట్లు చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు… రాజ్యాంగం, ఆత్మప్రబోధం మేరకు అధికారులు పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.. రాజకీయ నాయకులు, అధికారుల మధ్య అనైతిక సంబంధం సరికాదని హెచ్చరించిన ఆయన.. పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభించే విధంగా సంస్కరణలు ఉండాలన్నారు.. అధికారులకు వారి పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభించాలనే విషయంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని సూచించారు. విధి నిర్వహణలో ఏమైనా అనుమానాలొస్తే రాజ్యాంగంతో పాటు ఆత్మప్రబోధం…
హైదరాబాద్ నగరంలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. నగరంలో నాలాల మరమ్మతుల కారణంగా నేటి నుంచి జూన్ 4 వరకు సికింద్రాబాద్ సీటీవో జంక్షన్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రసూల్‌పురా నాలా మరమ్మతుల కారణంగా.. సీటీవో జంక్షన్ నుంచి రసూల్‌పురా వెళ్లే వాహనాలను హనుమాన్ దేవాలయం నుంచి ఎడమ వైపునకు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రసూల్‌పురా నుంచి కిమ్స్ ఆస్పత్రి మీదుగా…
ప్రముఖ విద్యావేత్త, కవి, ఇంజనీర్ డా. వి.మాలకొండారెడ్డి ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయనను ఉండేల మాలకొండారెడ్డి అంటేనే అంతా గుర్తుపడతారు. చిన్న తనం నుంచే ఆయన కవిత్వం చెప్పేవారు. చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడిగా ప్రసిద్ధి పొందారు. మాలకొండారెడ్డి 1932 ఆగస్టు 23 న ప్రకాశం జిల్లా లోని ఇనిమెట్ల గ్రామంలో జన్మించాడు. అల్లూరు, నెల్లూరులలో పాఠశాల చదువు ముగించి మద్రాసు గిండీ ఇంజనీరింగు కళాశాలలో బీఈ డిగ్రీ పూర్తిచేశారు. ఎడిన్‌బరో యూనివర్శిటీ (బ్రిటన్) నుండి…
తెలంగాణలో వరుస ఆత్మహత్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ నేతలు.. రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసిన బీజేపీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు.. ఖమ్మం సాయి గణేష్ ఆత్మహత్య, కామారెడ్డిలో సంతోష్, పద్మల ఆత్మహత్యలపైన సీబీఐతో విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు… రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ హత్యలు, పోలీసుల ప్రవర్తనపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామన్నారు.. ప్రతిపక్ష…
టీఆర్ఎస్ పార్టీ నేతల వ్యవహారాలు అధిష్ఠానానికి తలనొప్పిగా మారాయి. ఒకటి తర్వాత.. వరుసగా జరుగుతున్న ఘటనల్లో గులాబీ నేతలకు సంబంధాలు ఉండటం ఆ పార్టీకి తలనొప్పిగా పరిణమించింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో జరిగిన మూడు వ్యవహారాలు టీఆర్ఎస్ పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. వీటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక… టీఆర్ఎస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. రామాయంపేటకు చెందిన తల్లికొడుకులు ఆత్మహత్య చేసుకోవడం… సెల్ఫీ వీడియో మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ పేరు చెప్పడం… రాష్ట్రవ్యాప్తంగా దుమారం…
బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధర ఆల్‌టైం గరిష్టానికి చేరుకుంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,840కి చేరుకుంది. మరోవైపు 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం 10 గ్రాముల ధర రూ.49,850గా నమోదైంది. వెండి రేటు కూడా బంగారం ధర మాదిరిగానే పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.75వేలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర గత రెండు వారాలుగా క్రమంగా…