MLC Kavitha:అది అడిగే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ ఫ్యాక్టరీలు అమ్మగా వచ్చిన డబ్బును తెలంగాణ రాష్ట్రం కోసం వినియోగిస్తారా? ఇది అడిగే దమ్ము రాష్ట్ర బీజేపీ నాయకులకు ఉందా? అంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. చత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, కర్ణాటక, ఆదిలాబాద్ లో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్లకు పిలుస్తోందని మండి పడ్డారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతున్నారు, వాటి ద్వారా వచ్చే డబ్బుతో అసలు ఏం చేయబోతున్నారు అని చెప్పే చిత్తశుద్ది బిజెపి నాయకులకు ఉన్నదా ? అని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా కొత్త ఫ్యాక్టరీ పెట్టబోతున్నారా ? లేదా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినటువంటి కాలేశ్వరం లాంటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేయబోతున్నారా ? కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తారా ? అని మండిపడ్డారు.
Also Read
- Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- New Pensions: శుభవార్త.. కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
- Hyderabad: మాదాపూర్ ఓయో రూమ్‌లో యువతి మృతి.. ప్రియుడిపై అనుమానం?
తెలంగాణ లో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనులను , ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ మరియు ఇతర ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం ద్వారా మీరు ఏం సాధించాలని అనుకుంటున్నారు ? అని నిప్పులు చెరిగారు. దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రధానమంత్రిని కలిసి అదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ గురించి చర్చించారు , మంత్రి కేటీఆర్ గారు అనేకమార్లు ఉత్తరాలు కూడా రాయడం జరిగింది, ఎన్నో కుటుంబాలు ఆధార పడ్డ ఫ్యాక్టరీలను మూసివేసి మీరు ప్రజలకు ఏమి సమాధానం చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తామని ముందుకు వచ్చినా కూడా సిమెంట్ ఫ్యాక్టరీ అమ్మివేయడం వెనక ఉన్న అర్థం ఏమిటని మండి పడ్డారు. కొన్ని వేల కుటుంబాలు ఆధారపడ్డ ఫ్యాక్టరీని మూసివేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న బీజేపీ పార్టీని అడుగడుగునా ప్రశ్నించాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీ ఓ తోక పార్టీ
ప్రజల సంక్షేమం కోసం ప్రాంతీయ పార్టీలకు నిర్దిష్టమైన ఎజెండా ఉందని, రాహుల్ గాంధీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని, ఎందుకంటే మహారాష్ట్రలో వాళ్లు అధికారంలో ఉన్నారని, ప్రాంతీయ పార్టీ సపోర్ట్‌తోనే అక్కడ వాళ్లు అధికారంలో ఉన్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓ తోక పార్టీగా మారిందని, రాబోయే రోజుల్లో దేశంలోనూ ఆ పార్టీ తోక పార్టీగా మిగులుతుందని, ప్రాంతీయ పార్టీలే సారథ్య బాధ్యతలు వహిస్తూ దేశానికి దిశానిర్దేశం చేస్తాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
పార్టీలో ప్రక్షాళన చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించిందని.. దేశంలో నిరుద్యోగం పెరిగిందని, మతపరమైన సహనం లోపించిందని, ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల విజయంపై కాంగ్రెస్ అసూయ వ్యక్తం చేసినట్లు ఆమె వెల్లడించారు. మెరుగైన పాలన అందించాము కాబట్టే తాము సక్సెస్ అయినట్లు ఆమె తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరహాలో తమకు నాయకత్వ సంక్షోభం లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!