బేగంపేట్ చికోటి గార్డెన్ జీవన్ జ్యోతి హాల్ లో ఫాస్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. అయితే
ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా కే.ఏ.పాల్ హాజరుకానున్నారు. ఐతే ఈ సమావేశానికి పోలీసులు అనుమతి లేదంటూ.. బేగంపేట్ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కే ఏ పాల్ ఇక్కడికి వస్తే తప్పకుండా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
అయితే దీనిపై కేఏ.పాల్ స్పందించారు. పోలీసుల తీరుపై పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరాయి వ్యక్తులను అడ్డుపెట్టి తన సమావేశాన్ని అడ్డుకోలేరని మండి పడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో హాజరవుతానని నిన్న రాత్రే పాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే దీనిపై పోలీసు చెప్పిన పాల్ ప్రకటించడంతో.. బేగంపేట్ చికోటి గార్డెన్ జీవన్ జ్యోతి హాల్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం పాల్ ఇక్కడికి చేరుకుంటారని అనుచరుల సమాచారం.
అయితే .. తెలంగాణలో ప్రజలకు సేవ చేసేందుకు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ఓటర్లకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.. ఇప్పటిదాకా ఎవరెవరికో దోచుకునే వారికి అవకాశం ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా కేఏపాల్ రాష్ట్ర రాజకీయాలతో పాటు జాతీయ రాజకీయాల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కులాలు, మతాల పేరుతో చిచ్చు పెట్టే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి, కుటుంబ పార్టీలేనని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి బిజెపి అంటే భయం అన్నారు కే ఏ పాల్. కాంగ్రెస్ మినహా దేశంలోని మిగిలిన అన్ని పార్టీలు బిజెపి అనుబంధ పార్టీలేనని అన్నారు. తన వెనుక బీజేపీ ఉందనే విమర్శలు అర్ధరహితం అన్న పాల్.. అవి పని లేని కొందరు చేసే విమర్శలు గా కొట్టిపారేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు టీఆర్ఎస్ ఇలాంటి ఆరోపణ చేస్తోందని ఆయన మండిపడిన విషయం తెలిసిందే..
Russia-Ukraine war: పుతిన్‌పై ఆ దేశం నిషేధం.. సెనెట్‌లో బిల్లు..