హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ హెచ్ఐసీసీలో నేడు భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హెచ్ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్, సైబర్ టవర్స్-ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్-కొత్తగూడ ప్రాంతాల్లోని కార్యాలయాల నిర్వాహకులు పనివేళల్లో స్వల్ప మార్పులు చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంటుందని,…
ఎంత నిఘా పెట్టినా.. కఠిన చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్స్ దందా కొనసాగుతుందనేది ఓపెన్ సీక్రెట్.. ఎందుకంటే.. ఎప్పకప్పుడు భారీ స్థాయిలో డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి.. ఇక, ఇవాళ సినీ ఫక్కీలో ఓ వ్యక్తి కడుపు డ్రగ్స్ దాచి తరలిస్తున్నాడు.. ఆ వ్యక్తికి ఆపరేషన్ చేసి కొకైన్ క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్న ఘటన శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం రేపింది. రూ.12 కోట్ల విలువైన 1,157 గ్రాముల కొకైన్‌ను డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. సౌతాఫ్రికా జోహన్నెస్‌బర్గ్ ప్రయాణికుడు అనుమానాస్పదంగా…
గులాబీ పార్టీ సంబురానికి సర్వం సిద్ధం అయ్యింది.. హైదరాబాద్ గులాబీ మయం అయిపోయింది.. తెలంగాణ రాష్ట్ర సమితి 21 వసంతాలు పూర్తి చేసుకుని 22 వసంతంలోకి అడుగు పెడుతోన్న వేళ హైదరాబాద్ వేదికగా ప్లీనరీ నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇక, ప్రతినిధుల సభ ఈసారి 3 వేల మందితో జరుగనుంది. ఘనంగా ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది అధిష్టానం.. ఇక, తోరనాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు.. కటౌట్లు.. ఇలా ఎటు చూసినా గులాబీ రంగు పులుముకుంది.. ఇదే…
తెలంగాణ రాష్ట్ర సమితి 21 వసంతాలు పూర్తి చేసుకుని 22 వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈనెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఇక, ప్రతినిధుల సభ ఈసారి 3 వేల మందితో జరుగనుంది. ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను ప్రిపేర్ చేసి, వారిలో ఉత్సాహం నింపేలా పార్టీ అధిష్టానం ఘనంగా ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 11 గంటలకు ప్లీనరీ ప్రారంభం కానుంది. సమావేశానికి…
తెలంగాణ గులాబీ మయం అవుతోంది.. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఊరు వాడ, పల్లె పట్నం అనే తేడా లేకుండా ముస్తాబు అవుతోంది.. ఇక, టీఆర్ఎస్ ఫౌండేషన్ డేను పురస్కరించుకుని ప్లీనరీ నిర్వహిస్తున్నారు.. ప్లీనరీలో రేపు ఉదయం 11 గంటలకు గులాబీ పార్టీ బాస్, సీఎం కేసీఆర్ కీలక ప్రసంగాన్ని చేయబోతున్నారు.. ఈ నేపథ్యంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ జనరల్ సెక్రటరీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి…
తెలంగాణలోని ఉపాధ్యాయులు ప్రమోషన్ల కోసం ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నారు.. అయితే, వాళ్లకు గుడ్‌న్యూస్ చెప్పే విధంగా… ప్రమోషన్ల ఇప్పటి వరకు ఉన్న మరో అడ్డంకి కూడా తొలగిపోయింది.. పండిట్, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్ పై కోర్టుకు వెళ్లారు ఎస్జీటీలు.. అయితే, ఇప్పుడు కేసును ఉప సంహరించుకునేందుకు సిద్ధమయ్యారు.. ఒకటి, రెండు రోజుల్లో కోర్టులో ఉప సంహరణ పటిషన్ దాఖలు చేయబోతున్నారు.. పండిట్ పోస్టులకు అర్హులైన ఎస్జీటీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు తెలంగాణ విద్యా శాఖ మంత్రి…
బేగంపేట్ ట్రాఫిక్ డైవర్షన్ రూట్‌ని పరిశీలించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. పికెట్ నాలా నిర్మాణ పనుల కారణంగా దారి మళ్ళింపు ప్రాంతాల్ని పరిశీలించిన సీపీ ఆనంద్ పలు సూచనలు చేశారు. నాలా మరమ్మత్తుల పనులను పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్ పీవీ ఆనంద్…అక్కడ అమలు అవుతున్న ట్రాఫిక్ ఆంక్షలు ట్రాఫిక్ మళ్ళింపులను పరిశీలించారు. ఆయన వెంట ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ రంగనాథ్ వున్నారు. జూన్ 4వ తేదీ వరకు బేగంపేట్ రసూల్ పుర వరకు…
ఈ రోజుల్లో ఎవరికి వారే యమునా తీరే. ఎవరి దారి వారిది. ఉరుకుల పరుగుల జీవితం. అందునా నగర జీవనంలో పక్కవారి గురించి ఆలోచించే తీరిక, ఓపిక వుండదు. అసలే ఎండాకాలం. సూరీడు చుర్రుమంటున్నాడు. మామలుగా నడిచే వెళ్ళే వ్యక్తులు వడదెబ్బకు గురవుతున్నారు. రోడ్డపై నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తి హఠాత్తుగా కింద పడిపోయాడు. నగరంలో ఇది కామనే అనుకుని చాలామంది అతడి మానాన అతడిని వదిలేశారు. అతను అలాగే వుండిపోయాడు. కానీ కొందరు అలా కాదు. పక్కన…
సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంగ్ వార్ చోటు చేసుకుంది. పాత గొడవల కారణంగా వారసిగూడ పోచమ్మ ఆలయం వెనుక వీధిలో సాయంత్రం కొంతమంది యువకులు వచ్చి వీధిలో యువకులతో గొడవ పెట్టుకుని కర్రలతో దాడి చేసి హంగామా సృష్టించారు. కర్రలతో పాటు రాళ్లతో దాడి చేసి పూల కుండీలను ధ్వంసం చేసి స్థానికులను భయబ్రాంతులకు గురి చేశారు. దీంతో స్థానికంగా ఉన్న మహిళలు డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దాడి…