రాజకీయ, సామాజిక విశ్లేషకుడు సి.నరసింహారావు కన్నుమూశారు. అనారోగ్యంతో అర్థరాత్రి 1.50కి ఆయన తుదిశ్వాస విడిచారు. సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యక్తిత్వ వికాసంపై సి.నరసింహారావు అనేక పుస్తకాలు రాశారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సి. నరసింహారావు 1948, డిసెంబర్ 28న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 73 సంవత్సరాలు. క్రిష్ణా జిల్లా పెద్దపాలపర్రులో ఆయన జన్మించారు. విజయీభవ, విజయపథం, వ్యక్తిత్వ వికాసం, అన్యోన్య…
పోలీస్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన పదిరోజుల్లో 3,52,433 దరఖాస్తులు వచ్చాయి. పోలీస్, ఎక్సైజ్, రవాణాశాఖల్లోని వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 17,291 పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి ఇటీవల మొత్తం ఆరు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. మే 2 నుంచి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలు కాగా తొలి పదిరోజుల్లో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నట్టు టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ వీవీ…
ఈ నెల 16వ తేదీ నుంచి 21 వరకు వారం రోజుల పాటు ఎలాంటి ప్రవేశం రుసుము లేకుండా సాలార్జంగ్ మ్యూజియంలోకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 18న అంతర్జాతీయ మ్యూజియం డేను పురస్కరించుకుని హైదరాబాద్, సాలార్జంగ్ మ్యూజియంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్ రెడ్డి తెలిపారు. దీనికోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 16 నుంచి 21 వరకు, వారం రోజులపాటు వేడుకలు…
‘స్విగ్గీ’ గురించి ప్రత్యేకం పరిచయం చేయాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఫుడ్ డెలవరీలతో చాలా ఫేమస్ అయింది. ప్రస్తుతం మెట్రోసిటీల్లో బిజీ లైఫ్ కారణంగా హోటళ్లు వెళ్లి తినే అలవాటును తగ్గించుకుంటున్నారు. దీంతో స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలవరీ ప్లాట్ ఫారాలను ఆశ్రయిస్తున్నారు వినియోగదారులు. ఆర్డర్లు చేసిన తక్కువ సమయంలో నేరుగా ఫుడ్ ను ఇళ్లు తీసుకువస్తున్నారు. దీంతో స్విగ్గీ సంస్థకు ఆదాయం బాగానే వస్తోంది. ఇదిలా ఉంటే స్విగ్గీ ఇన్నాళ్లుగా నిర్వహిస్తున్న…
రాజధానిలోని పేదలందరికీ ఉచితంగా అన్నిరకాల రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి రానున్నాయి. జీహెచ్ఎంసీలో మరో 10 మినీ హబ్స్ (రేడియాలజీ)ను బుధవారం ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం హరీశ్ రావ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు హైదరాబాద్ వాసుల కోసం టీ-డయాగ్నోస్టిక్స్ కింద మొత్తం 20 మినీ హబ్‌లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కొనియాడారు. నిరుడు జనవరిలో 8 హబ్స్‌ను ప్రారంభించిన సర్కారు.. బుధవారం మరో పదింటిని ప్రారంభించడంపై ఆనందం వ్యక్తం చేశారు.…
దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవరిస్తున్న స్వచ్ఛంద సంస్థలపై రైడ్స్ నిర్వహిస్తోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం నిబంధనలను ఉల్లంఘించి పలు స్వచ్ఛంద సంస్థలకు అనుమతులు ఇచ్చినందుకు సీబీఐ ఈ దాడులు నిర్వహిస్తోంది. ఎన్జీఓ సంస్థలు, వాటికి సంబంధించిన వ్యక్తులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్ టీమ్ దాడులు చేస్తోంది. దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో.. హైదరాబాద్, ఢిల్లీ, కోయంబత్తూర్, మైసూర్, రాజస్థాన్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్సీఆర్ఏ) నిబంధనలు…
చోరీ కేసులో ఓ పోలీసు ఇన్స్పెక్టర్ చేతివాటం చూపించాడు. నిందితుని ఖాతానుంచి పైసల కాజేసాడు. ఈవార్త తెలంగాణలోనే సంచళనంగా మారింది. నిందితున్ని శిక్షించాల్సిన పోలీసులే నిందితుని ఖాతాలోంచి డబ్బులు గోల్ మాల్ చేయడం ఏంటని విమర్శలకు దారితీంది. ఈవిషయం కాస్త రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ వరకు చేరడంతో స్పందించిన ఆయన ఇన్స్పెక్టర్ దేవేందర్ ను సస్పెన్షన్ వేటు వేశారు. అసలు ఏం జరిగింది ? ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో అగర్వాల్ అనే వ్యక్తిని చోరీ…
అసని తుఫాన్ ప్రభావంతో హైదరాబాద్‌లో వాన కురుస్తుంది. నగర వ్యాప్తంగా ఉదయం 4.30 గంటల నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. తుఫాన్ ప్రభావంతో ఆకాశం మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో వాతావరణం చల్లబడటంతో నగరవాసులకు ఉక్కబోత నుంచి ఉపశమనం లభినట్లయింది. బుధవారం తెల్లవారుజాము నుంచే హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, కోఠి, నాంపల్లి, లక్డీకపూర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్‌లో వానకురుస్తున్నది. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో చిరు జల్లులు పడుతున్నాయి. అసని తుఫాను…
నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పదిరోజుల వ్యవధిలో హత్యలు జరగడం ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆస్తి కోసం ఒకచోట.. డబ్బులు తిరిగి ఇవ్వనందుకు మరోచోట.. ఇతరత్రా కారణాలతో ఇంకోచోట హత్యలు జరుతూనే వున్నాయి. సరూర్‌నగర్ మున్సిపాలిటీ సమీపంలో పరువుహత్య మరవకముందే.. రాజధాని హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెం.12లో అర్ధరాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నీలోఫర్ కేఫ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిల్‌తో…
బంగారం మెరిసింది. వెండి వెలవెలబోయింది. మంగళవారం మార్కెట్లలో బంగారం, వెండి ధరలు అస్థిరంగా నమోదయ్యాయి. మార్కెట్లలో బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు ఇదే ట్రెండ్ నమోదైంది. చెన్నైలో మాత్రం బంగారం, వెండి రెండు ధరలూ తగ్గి అక్కడి కొనుగోలుదారులకు శుభవార్తగా నిలిచాయి. పెరుగుతోన్న బాండ్ ఈల్డ్స్.. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలపై ఒత్తిళ్లకు దారితీస్తుందని విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయంగా నమోదవుతోన్న ధరల ప్రభావం కూడా దేశీయంగా…