సవాలపై వేసే పేలాలు అమ్ముకునేలా వుంది నీ భాగోతం అనే సామెత మనం కామెడిగానో.. లేదంటే.. కోపంలోనే.. అంటూనో వింటూనో వుంటాం. కానీ అది నిజ జీవితంలో నిజమైవుతోంది. కుటుంబంలోని వ్యక్తి చనిపోతే పుట్టెడు దుఖంలో వున్న కుటుంబాలకు సహాయం చేయాల్సింది పోయి అదే ఆశరాగా చేసుకుని మృతదేహంపై కూడా చిల్లర అడుక్కునే రకానికి దిగజారుతున్నారు. అదికూడా మార్చురీలో తీసుకెల్లేందుకు కాసులిస్తేనే లోపలికి మృతదేహాన్ని పంపిస్తా అంటూ బేరసారాలు చేశాడు. పుట్టెడు దుఖంలో వున్న కుటుంబం కన్నీరు కాస్తున్న కాసులే కావాలని పట్టుబడ్డాడు. ఇది ఎక్కడో కాదు మన భాగ్యనంగలోని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ వద్ద చోటుచేసుకుంది.
ఇక వివారల్లోకి వెళితే.. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శంకర్ నగర్ లో రాత్రి మహమ్మద్ మజీద్ ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డారు. పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మద్యం మత్తులో విధుల్లో ఉన్న ఆ.. సిబ్బంది రూ.1000 ఇస్తేనే మృతదేహాన్నీ తీసుకుంటానని పోలీసులకు, బాధిత బంధువులతో వాగ్వివాదానికి దిగాడు. అందరూ కలిసి ఎంతగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నాడు. దీంతో గంటల పాటు మార్చురీ ముందే శవంతో వేచి వుండే పరిస్థితి ఏర్పడింది.
పోలీసులు చెప్పినా వారితో కూడా వాగ్వాదం చేసి మృత దేహాన్ని బయటపెట్టడంతో.. పలు విమర్శలకు దారితీస్తోంది. పోలీసుల మాటనే బేఖాతరు చేసిన మార్చురీ సిబ్బందికి ఇక ప్రజల మాటకు విలువ వుంటుందా అంటూ ప్రశ్నిస్తున్నారు. పోలీసుల ముందే బేరసారాలు ఆడుతుంటే పోలీసు బాసులే ఏం చేయలేక పోయారు.. కుటుంబంలోని వ్యక్తి మృతితో కన్నీరు కాస్తున్న కుటుంబాలతో ఎన్ని డబ్బులు డిమాండ్లు చేసి వుంటారో, ఇలా ఎన్ని వసూళ్లుకు పాల్పడ్డారో అని మండిపడుతున్నారు.
ఇలాంటి ఘటనలు ఇక్కడ ఇంకా ఎన్ని చోటుచేసుకున్నాయో అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల ముందే తప్పతాగి డబ్బులు డిమాండ్ చేసిన మార్చురీ మందుబాబు కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు.
Irfan Pathan: అత్యుత్తమ ఐపీఎల్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరో తెలుసా?