నగరంలో ఇకపై 24 గంటలు బార్లు, రెస్టారెంట్లు, పబ్బులలో మద్యం అనుతించబడదని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల, ప్రతినిధుల దృష్ట్యా ఐదంతస్తుల రేటింగ్ ఉన్న హోటల్‌కు 24 గంటలు మద్యం అనుమతి ఉంటుందని తెలిపారు. అయితే, అది సాధారణ ప్రజలకు కాదని, ఆయా హోటల్స్‌లో ఉండే పర్యాటకులకు మాత్రమేనని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చిన్నపాటి లాభాల కోసం నిబంధనలు ఉల్లంఘిస్తూ హైదరాబాద్‌కు అపఖ్యాతి తీసుకురావద్దని…
బీజేపీకి రాజీనామా చేసి మంత్రి సబితా రెడ్డి సమక్షంలో బిజెపి సర్పంచ్ అనిత శ్రీనివాస్ టిఆర్ఎస్ పార్టీలో చేరారు. బిజెపి సర్పంచ్ అనిత శ్రీనివాస్ ను టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సాదరంగా ఆహ్వానించారు. శ్రీనగర్ కాలనీలోని మంత్రి నివాసంలో పెద్ద ఎత్తున అనుచరులతో టి ఆర్ ఎస్ లో చేరిన బీజేపీ సర్పంచ్ ను టి ఆర్ ఎస్ కండువా కప్పి సాధారంగా పార్టీలోకి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆహ్వానించారు. ఈ…
ప్రజలందరికీ అధికార సేవలు సులువుగా అందాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని మంత్రి హరీశ్ రావ్ అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ఉండటం ఇక్కడి ప్రజల అదృష్టమని తెలిపారు. రూ.5 కోట్లతో మండల కాంప్లెక్స్ నిర్మాణ పనులు ప్రారంభించుకున్నామని గుర్తు చేశారు. మండల కేంద్రమైన ములుగు అభివృద్ధి కై రూ.10 కోట్లు మంజూరు చేసుకున్నామని అన్నారు. మన ఊరు-మన బడి కింద 7300 కోట్లు వెచ్చించి, ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియంలో తరగతులు ప్రారంభిస్తున్నామని…
సిద్దిపేట జిల్లా బస్ డిపో మెకానిక్ సూపర్ వైజర్ రవీందర్ మానవత్వం చాటుకున్నాడు. నిన్న రాత్రి మిడిదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన నాగరాజు సిద్దిపేట డిపోకు చెందిన బస్సులో బ్యాగు మర్చిపోయాడు. దీంతో బస్ డిపో మెకానిక్ సూపర్ వైజర్ రవీందర్ ఆబ్యాగ్ ను చూసాడు. ఆబ్యాగ్ లో ఏముందో అని పరీక్షించాడు. బ్యాగ్ లో రూ. 50వేలు వుండడంతో ఖంగుతిన్నాడు. ఎవరో మర్చిపోయారని, బ్యాగును యజమానికి తిరిగి ఇవ్వాలని అనుకున్నాడు. కానీ..బ్యాగ్ యజమాని అడ్రస్…
కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరల్లో మార్పు చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చాలా రోజుల తర్వాత మరోసారి పెట్రోల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 17 పైసలు, లీటర్ డీజిల్‌పై 16 పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.119.66కి చేరింది. అటు లీటర్ డీజిల్ రూ.105.65కి ఎగబాకింది. New Rule: అలర్ట్.. పాన్ కార్డు వాడే వారికి కొత్త రూల్ అయితే దేశ రాజధాని ఢిల్లీలో…
హైదరాబాద్ వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం ఘటన కొత్త మలుపు తిరిగింది. సాహెబ్‌నగర్ బ్రాంచీలో క్యాషియర్ రూ. 22 లక్షల 53వేల 378 లక్షల నగదుతో పరారైనట్లు… బ్యాంకు అధికారులు మంగళవారం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనపై వచ్చిన ఆరోపణలపై సెల్ఫీ వీడియో ద్వారా క్యాషియర్ ప్రవీణ్ వివరణ ఇచ్చాడు. హైదరాబాద్ వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడాలో నగదు మాయం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాషియర్ ప్రవీణ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.…
కొందరి నిర్లక్ష్యం మరొకరికి ప్రాణ సంకటంగా మారుతోంది. ఇంటిలో ఉన్న సంపు పై కప్పు మూయకపోవడంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పేట్ బషీరాబాద్ లోని గుండ్లపోచంపల్లి ఎస్సి కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో 2 ఏళ్ళ బాలుడు ఆడుకుంటున్నాడు. అయితే.. ఆ సమయంలో అక్కడే తెరిచి ఉన్న నీటి సంప్‌లో పడి 2 ఏళ్ల బాలుడు కృష్ణ దాస్ మృతి చెందాడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు…
మౌలిక వసతుల్లో దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ ముందున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. నివాసయోగ్యమైన నగరాల్లోనూ హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందని చెప్పారు. నగరంలోని రాయదుర్గంలో ఉన్న నాలెడ్జ్ సెంటర్లో అమెరికాకు చెందిన కాల్‌అవే గోల్ఫ్ సంస్థ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో కాల్‌అవే సంస్థ ఆఫీస్ ఏర్పాటవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో డిజిటెక్ కంపెనీలు చాలా ఉన్నాయని కేటీఆర్ అన్నారు. శాండియాగోలో క్వాల్కం కేంద్ర కార్యాలయం ఉంది. సంస్థ…
శాంతి భద్రతల్లో దేశంలోనే అత్యంత సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా పేరు ప్రతిష్టలను మన హైదరాబాద్ నగరం సంపాదించింది. మర్సర్ సర్వేలో సైతం ప్రపంచంలోనే 16వ స్థానం దక్కించుకుంది. తెలంగాణ సాధించిన అనంతరం పోలీసుల సంస్కరణలు, ప్రభుత్వ చర్యలు, పాలకుల ప్రత్యేక దృష్టితో శాంతిభద్రతల్లో ఎంతో మార్పు వచ్చిందని పోలీస్ బాస్‌లే స్వయంగా చెబుతున్నారు. కానీ, కొన్ని నెలలుగా నగరంలో చోటు చేసుకుంటున్న ఘటనలు నగరంలో మళ్లీ రౌడీల ఉనికిని వెల్లడిస్తున్నాయి. నగరంలోని సౌత్‌జోన్‌తోపాటు సెంట్రల్, ఈస్ట్,…
హైదరాబాద్ లో రోజు రోజుకి వంద FIRలు నమోదు అవుతుంటే.. అందులో 20 సైబర్ క్రైమ్ కేసులే ఉంటున్నాయి. ఇక వనస్థలిపురం బ్యాంక్ లో క్యాషియర్ చోరీ కేసులో కొత్త కోణం చవి చూసింది. క్రికేట్ బెట్టింగ్ వ్యవహారమే చోరీకి కారణమని తేలింది. బెట్టింగ్ లో నష్టపోయి చోరీచేసానని మేనేజర్ కు, సహ ఉద్యోగులకు క్యాషియర్ ప్రవీణ్ మెస్సేజ్ లు పెట్టాడు. బెట్టింగ్ లో డబ్బులు వస్తే తిరిగి ఇస్తాను.. లేదంటే సూసైడ్ చేసుకుంటానని తెలిపాడు. దీంతో…