టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (73) అనారోగ్యంతో గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నివాసంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆయన తుది శ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా ఉరందూరులో 1949, ఏప్రిల్ 15న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మించారు. ఆయన తండ్రి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే గంగా సుబ్బరామిరెడ్డి వారసుడిగా 1989లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుసగా ఐదుసార్లు…
హైదరాబాద్ సరూర్‌నగర్‌లో దారుణ హత్యకు గురైన నాగరాజు అంత్యక్రియలు పూర్తిచేశారు కుటుంబసభ్యులు.. వికారాబాద్ జిల్లాలోని అతని స్వగ్రామంలో.. పోలీసుల బందోబస్తు మధ్య అంతిమయాత్ర సాగింది.. నాగరాజును హత్య చేసినవారిని ఎన్కౌంటర్ చేయాలని నినాదాలు చేశారు గ్రామస్తులు.. అంత్యక్రియల తర్వాత ఎన్టీవీతో మాట్లాడిన నాగరాజు భార్య ఆశ్రీన్.. తాను అన్నవాళ్ల దగ్గరికి వెళ్లేదిలేదని స్పష్టం చేశారు. నాగరాజు కుటుంబ సభ్యులు తనతో సఖ్యతగానే వుంటున్నారని.. పెళ్లి చేసుకున్నా తనను ఒక్క మాట కూడా అనలేదని వెల్లడించింది ఆశ్రీన్. Read…
శుక్రవారం నుండి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థినీ, విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.. విద్యార్థులు ఆత్మ విశ్వాసంతో పరీక్షలు రాయాలని, కష్టపడి చదివిన విద్యార్థులు ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలి ఆకాక్షించారు. విద్యార్థులెవరూ భయానికి, ఆందోళనకు గురికావద్దు అని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు 9,07,393 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఇందుకోసం 1,443 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. Read Also: Union…
సరూర్ నగర్ పరువు హత్యపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నందుకే ఈ హత్య జరిగిందని ఆరోపించిన ఆయన.. ఈ హత్య చేసిన వ్యక్తుల్ని, అలాగే వారి వెనకున్న శక్తుల్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా మతపరంగా జరిగిన హత్యగానే బీజేపీ భావిస్తోందన్నారు. ఈ కిరాతకమైన ఘటనపై సెక్యులర్ పార్టీలు, సెక్యులర్ మేధావులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. లవ్ జిహాద్…
తానొకటి తలిస్తే దైవం ఒకటి తెలుస్తుందనే సామెత బెట్టింగ్ ఈ వ్యవహారంలో జరిగిందని చెప్పవచ్చు. ముంబై హైదరాబాద్ హైదరాబాద్ చెన్నై కేంద్రాలుగా నడుస్తున్న బెట్టింగ్ వ్యవహారం బట్టబయలు చేసేందుకు పోలీసులు చేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయిన వెంటనే బెట్టింగ్‌ల జోరు పెరిగిపోతున్నది. ఇలాంటి బెట్టింగ్ లను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. Read Also: Kurnool: ఫేస్బుక్ ఫ్రెండ్‌కి బుద్ధి చెప్పిన యువతి అయితే హైదరాబాద్‌లో…
తెలంగాణలో బీజేపీ కేంద్ర పార్టీ చాప కింద నీరులా తమ యాక్టివిటీ చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే సెంట్రల్ టీంలు తెలంగాణలో మకాం వేసాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.. ఇక, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఉమ్మడి జిల్లాకో ఇంచార్జ్ ని కేంద్ర పార్టీ నియమించబోతుంది అని తెలుస్తుంది… ఈ ఇంచార్జ్ లు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు ఉంటారని సమాచారం. ఇప్పటికే కేంద్రంలోని పార్టీ.. కొన్ని టీమ్‌లను తెలంగాణ పంపిందని టాక్. ఆ టీమ్‌లు…
తెలంగాణలో టీడీపీపై ఫోకస్ పెడుతున్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. అందులో భాగంగా ఇవాళ తెలంగాణ టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. తెలంగాణలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. లీడర్లందరూ క్షేత్రస్థాయికి వెళ్లి సభ్యత్వ నమోదుపై పనిచేయాలి.. పార్టీ కోసం అందరూ పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదుపై కోఅర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.. మన టీడీపీ యాప్‌లో నాయకులందరూ…
తెలంగాణలో త్వరలోనే పర్యటించనున్నారు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ.. ఆయన రెండు రోజుల పర్యటనలో భాగంగా.. రెండో రోజు ఉస్మానియా యూనివర్సిటీలో కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే, పోలీసుల నుండి కానీ, యూనివర్సిటీ వీసీ నుంచి గానీ ఇప్పటి వరకు అనుమతి లభించలేదు. అనుమతిపై తుది నిర్ణయం వీసీదేనని హైకోర్టు కూడా స్పష్టం చేసింది.. అయితే, రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ టూర్ కోసం సీఎం కేసీఆర్‌ను కలుస్తానని.. దాని కోసం అపాయింట్మెంట్…
హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద కమాండ్ కంట్రోల్ వాచ్ టవర్, పెట్రోలింగ్ సిస్టమ్‌ను సైబరాబాద్ సీపీ స్టెఫెన్ రవీంద్రతో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రజల భ్రదత కోసమే తాము అనేక చర్యలు చేపడుతున్నామని డీజీపీ అన్నారు. హైదరాబాద్‌కు తలమానికమైన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి రక్షణ కోసం 67 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. కమాండ్ కంట్రోల్‌కు ఈ కెమెరాల్ని అనుసంధానం చేశామని చెప్పిన ఆయన, ఈ కెమెరాల ఏర్పాటుకు రహేజా…
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో.. ఆయనతో ఓ కార్యక్రమం నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నా అనుమతి మాత్రం దొరకలేదు.. ఇక, ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది.. అయితే, ఓయూలో రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతిపై వీసీదే తుది నిర్ణయమని చెప్పింది హైకోర్టు.. ఓయూ విద్యార్థులు వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాహుల్ గాంధీ టూర్ అనుమతికి సంబంధించిన అవకాశాన్ని పరిశీలించాలని…